ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకుడు. `అడవి రాముడు` తర్వాత వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన చిత్రమిది. రోజా మూవీస్ పతాకంపై ఎం అర్జున రాజు, కె శివరామ రాజు నిర్మించారు. ఇందులో శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది.
అంతకు ముందు `బడిపంతులు` చిత్రంలో ఎన్టీఆర్‌కి మనవరాలిగా బాల నటిగా నటించిన శ్రీదేవి ఈ మూవీతోనే హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. దాదాపు ఏడేళ్ల తర్వాత రామారావుతో నటించింది.
మొదట శ్రీదేవి హీరోయిన్ అంటే అంతా ఆశ్చర్యపోయారు. రామారావు సరసన ఈ అమ్మాయేంటి? అన్నారు. దర్శకుడు కన్విన్స్ చేయడంతో ఒప్పుకోక తప్పలేదు.
కానీ ఇందులోని `ఆకు చాటు పింద తడిసే` పాట ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే. అప్పట్లో మాస్ ఆడియెన్స్ ని ఊర్రూతలూగించింది. ఈ పాట కోసమే ఆడియెన్స్ సినిమా చూడటం విశేషం. అంతగా ఉర్రూతలూగించిందని చెప్పొచ్చు.
ఇందులో ఎన్టీఆర్, శ్రీదేవి కూడా అదరగొట్టారు. వీరి కెమిస్ట్రీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఇదేకాదు ఇందులోని పాటలన్నీ బంపర్ హిట్.