ఎన్టీఆర్‌, నెల్సన్‌ మూవీకి మతిపోయే టైటిల్‌

Published : Mar 15, 2025, 01:59 PM ISTUpdated : Mar 15, 2025, 09:17 PM IST

Ntr Next Title:ఎన్టీఆర్‌ క్రమంగా తన సినిమాల లైనప్‌ ని పెంచుతున్నాడు. ఇటీవల నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లో సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే. దీనికి అదిరిపోయే టైటిల్‌ వినిపిస్తుంది. 

PREV
15
ఎన్టీఆర్‌, నెల్సన్‌ మూవీకి మతిపోయే టైటిల్‌
ntr

Ntr Next Title:యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ క్రమంలో తన సినిమాల లైనప్‌ని పెంచుకుంటున్నారు. ప్రభాస్‌ మాదిరిగానే తాను కూడా వరుసగా భారీ పాన్‌ ఇండియా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అందులో భాగంగా క్రేజీ ప్రాజెక్ట్ లకు కమిట్‌ అయ్యారు తారక్‌. వాటి టైటిల్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేయడమే కాదు, సినిమాలపై అంచనాలను పెంచుతున్నాయి. 

25
Junior NTRs Devara Two film update out

ఎన్టీఆర్‌ చివరగా `దేవర` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. దీనికి పార్ట్ 2గా కొరటాల డైరెక్షన్‌లో `దేవర 2` రావాల్సి ఉంది. ఇది ఈ ఏడాది ఎండింగ్‌లో ప్రారంభమవుతుందట. మరోవైపు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి `వార్‌ 2` చిత్రంలో నటిస్తున్నారు.

ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్‌ పూర్తయ్యింది. ఇటీవలే సాంగ్‌ చిత్రీకరించారు. ఎన్టీఆర్‌, హృతిక్‌లపై ఈ సాంగ్‌ షూట్‌ చేసినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందట. 

35
Prashanth Neel

త్వరలోనే ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఇది 1960 కోల్‌ కత్తా బ్యాక్‌ డ్రాప్‌లో యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని, కొంత పొలిటికల్‌ టచ్‌ ఉంటుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీకి `డ్రాగన్‌` అనే టైటిల్‌ వినిపిస్తుంది. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. `డ్రాగన్‌` వేరే రేంజ్‌లో ఉంటుందని, `పుష్ప 2`ని మించి ఉంటుందని తెలిపారు. 

45
nelson dilipkumar

ఇక నెక్ట్స్ ఎన్టీఆర్‌ సినిమా ఫైనల్‌ అయ్యింది. తమిళ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌లో మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్‌మెంట్స్ దీన్ని నిర్మించబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమాకి టైటిల్‌ కన్ఫమ్‌ అయ్యిందట. `రాక్‌` అనే టైటిల్‌ అనుకుంటున్నారట. టీమ్‌ లో డిస్కషన్‌ స్టేజ్‌లో ఉంది. దాదాపు ఈ టైటిల్‌నే ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

55
NTR Jr

ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రజనీకాంత్‌తో `జైలర్‌ 2` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. ఈ మూవీ అయిపోయిన తర్వాత నెల్సన్‌.. ఎన్టీఆర్‌ సినిమాని తెరకెక్కించనున్నారు.

ఇది వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. దీనికి అనిరుథ్ రవిచందర్‌ సంగీతం అందించబోతున్నారు. ఎన్టీఆర్‌, నెల్సన్‌, అనిరుథ్‌ కలిస్తే నిజంగానే `రాక్‌` అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read  more: చిరంజీవి, బాలయ్య వచ్చినా కాలు మీద కాలు తీయని సిల్క్ స్మిత ఆ కమెడియన్‌ వస్తే లేచి నిలబడుతుంది.. ఎవరా నటుడు?

also read: ఆస్కార్‌ అవార్డులపై మంచు విష్ణు బోల్డ్ స్టేట్‌మెంట్‌, 200కోట్లు ఇస్తా తెప్పించండి

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories