తమన్నా, విజయ్ వర్మ విడిపోలేదా ? లవ్‌ ఎఫైర్‌లో ట్విస్ట్.. హోలీ వేడుక ఫోటోలు వైరల్‌

Tamannaah-Vijay varma: నటి తమన్నా, విజయ్ వర్మ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ హోలీ సందర్భంగా వీరిద్దరు ఓకే చోట సెలబ్రేషన్‌ చేసుకోవడంతో ఇప్పుడు కొత్త రూమర్స్ తెరపైకి వచ్చాయి. 

Tamannaah, Vijay varma

Tamannaah-Vijay varma: నటీనటులు ప్రేమలో పడటం, ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం సినిమాల్లో కామన్ అయిపోయింది. టాలీవుడ్‌, కోలీవుడ్ సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటివి చాలా జరిగాయి. బాలీవుడ్‌లో ప్రేమ, బ్రేకప్ అంటే ఒక లెక్కే కాదు అనేలా ఉంది.

తమన్నా - విజయ్ వర్మ ప్రేమ

ప్రముఖుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. పెళ్లి నుంచి విడాకుల వరకు ఏదైనా జరిగినా అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తమన్నా, విజయ్‌ వర్మల లవ్‌ ట్రాక్‌ కూడా అందరిని ఆకర్షించింది. గత 3 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న తమన్నా, విజయ్ వర్మ విడిపోయారని అన్నారు.


ఈ సంవత్సరం తమన్నా

ఈ సంవత్సరం వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ బ్రేకప్ వార్త చాలా మంది అభిమానులను బాధపెట్టింది. తమన్నా పెళ్లి చేసుకోవాలని అనుకుందట, కానీ విజయ్ వర్మ ఒప్పుకోలేదట. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నారట. దీని గురించి ఎవరూ బయటకు చెప్పకపోయినా, ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి తీసేశారట.

తమన్నా, విజయ్ వర్మ ఒకే చోట హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

బాలీవుడ్ మీడియాలో వీళ్ల బ్రేకప్ గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇప్పుడు తమన్నా, విజయ్ వర్మ ఒకే చోట హోలీ జరుపుకోవడంతో ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టినట్టు ఉందని అంటున్నారు. ఇద్దరూ తమ బ్రేకప్ గురించి ఏం చెప్పకపోయినా, రవీనా టాండన్ ఇంట్లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

దీనికి సంబంధించిన వీడియోలు. ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, హోలీ ఆడుతున్న ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. 

తమన్నా బ్రేకప్ నిజంగా జరిగిందా?

సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయినా స్నేహం కొనసాగిస్తారు. తమన్నా, విజయ్ వర్మ కూడా అలానే కలిశారా? లేక నిజంగానే తమన్నా బ్రేకప్ అనేది పుకారా? వేచి చూడాలి.

read  more:చిరంజీవి, బాలయ్య వచ్చినా కాలు మీద కాలు తీయని సిల్క్ స్మిత ఆ కమెడియన్‌ వస్తే లేచి నిలబడుతుంది.. ఎవరా నటుడు?

also read: Ranya Rao Case: నటి రన్యా రావ్ కి కోర్ట్ షాక్‌, బెయిల్ పిటిషన్ కొట్టివేత

Latest Videos

click me!