Nt RamaRao
Nt RamaRao: ఎన్టీ రామారావు సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నారు. తన మరదలు బసవతారకంని 1943లోనే వివాహం చేసుకున్నారు. 1949లో `మనదేశం` సినిమాతో నటుడిగా మారారు. అంతకు ముందు నాటకాలు ప్రదర్శించేవారు. సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే అప్పట్లో తన భార్య బసవతారకం హైదరాబాద్‌లో ఉండేది, ఆయన మద్రాస్(చెన్నై)లో సినిమాలు చేసేవారు. కలవడం చాలా కష్టం.
Nt RamaRao
అడపాదడపా ఎన్టీ రామారావు వచ్చిపోతుండేవారు, కొన్నాళ్ల తర్వాత ఆమెని కూడా మద్రాస్‌కి తీసుకెళ్లారు. అయితే అప్పట్లో కుటుంబ నియంత్రణ అనేది తెలియకపోవడంతో వరుసగా పిల్లల్ని కనేవారు. అలా ఎన్టీఆర్, బసవతారకంతో 12 మంది పిల్లల్ని కన్నారు. ఈ లెక్కన కొన్నేళ్లపాటు ఆమె పిల్లల్ని కంటూనే ఉంది. ఎప్పుడూ ప్రెగ్నెంట్, డెలివరీ అనేలానే ఉండేది. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండేవారు. మూడు షిఫ్ట్ ల్లో పనిచేసేవారు. ఇంట్లో రిలీఫ్ ఉండేది కాదు. భార్య హైదరాబాద్‌లో ఉండేది. దీంతో ఒంటరి ఫీలింగ్ ని ఫేస్ చేశాడట రామారావు.
ntr, krishna kumari
ఆ సమయంలో హీరోయిన్ కృష్ణకుమారితో ఎక్కువ సినిమాలు చేశారు రామారావు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. ఇతర పెద్ద హీరోయిన్లు తనకు హ్యాండివ్వడంతో కృష్ణకుమారిని రిపీట్ చేశాడు. అది ఇద్దరి మధ్య ప్రేమకి కారణమైంది. ప్రేమ మాత్రమే కాదు, ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిందట. ఎవరికీ తెలియకుండా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. పెళ్లికి రెడీ అయ్యారు. మరికొన్ని గంటల్లో మ్యారేజ్. అయితే ఈ విషయం రామారావు తన తమ్ముడు, నిర్మాత త్రివిక్రమరావుకి చెప్పాడు. దీంతో ఆయన హుటాహుటిన మద్రాస్‌కి వెళ్లారు. ఆయన వచ్చీ రావడంతోనే డైరెక్ట్‌గా కృష్ణకుమారి ఇంటికి వెళ్లి ఆమెని బెదిరించాడట.
Nt RamaRao
ఎన్టీఆర్‌ని ఆంధ్ర దేశం అంతా రాముడిలా చూస్తారు. ఎంతగానో అభిమానిస్తారు. అలాంటిది ఆయన రెండో పెళ్లిచేసుకుంటున్నాడని తెలిస్తే షాక్ అవుతారు. ఎన్టీఆర్ పరువు మొత్తం పోతుందని చెప్పి ఆమెని బెదిరించాడట. తన వద్ద ఉన్న తుపాకీతో వార్నింగ్ ఇచ్చాడట. దీంతో ఆ దెబ్బకి చెన్నై వదిలి బెంగుళూరు వెళ్లిపోయిందట కృష్ణకుమారి. అలా తమ్ముడు త్రివిక్రమ రావు వల్ల ఎన్టీఆర్ రెండో పెళ్లి ఆగిపోయింది. ఇదంతా తన భార్య బసవతారకంకి తెలియకుండానే జరిగిందట. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు వెల్లడించారు.
ntr, krishna kumari
ఆ ఘటన తర్వాత మళ్లీ పెళ్లి అనే మాట ఎత్తలేదు రామారావు. కొన్నాళ్లకి బసవతారకమ్మ క్యాన్సర్ బారిన పడ్డారు. 1985లో ఆమె కన్నుమూసింది. ఆమె పేరుతోనే ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇక భార్య మరణించే నాటికి రామారావు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సీఎంగా కూడా ఉన్నారు. కొంత కాలం ఒంటరిగానే ఉన్న ఆయన ఆ తర్వాత ప్రొఫేసర్ లక్ష్మి పార్వతికి ఆకర్షితుడయ్యాడు. ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఎంట్రీతో రాజకీయంగా పలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆయనపై పొలిటికల్ కుట్ర జరిగిందంటుంటారు. మొత్తానికి అధికారం కోల్పోయి డిప్రెషన్‌లోకి వెళ్లి అనారోగ్యంతో బాధపడి 1996లో కన్నుమూశారు ఎన్టీఆర్.