2 ఏళ్లుగా 100 స్క్రిప్ట్ లను రిజెక్ట్ చేసిన మెగా హీరో ? కారణం ఏంటి? ఎందుకు సినిమా చేయడంలేదు?

దాదాపు రెండేళ్ళుగా సినిమాల జోలికి వెళ్ళలేదు ఓ మెగా హీరో, అవకాశాలు లేవా అంటే.. ఈరెండేళ్ళలో 100 కథలు విన్నాడట, నిర్మాతలు రెడీగా ఉన్నారు. కాని సినిమాలు మాత్రం చేయడంలేదు. కారణం ఏంటి? కుర్ర హీరో ప్రాబ్లమ్ ఏంటి? 

Mega Hero Vaishnav Tej Has Rejected 100 Scripts in 2 Years and Stayed Away from Movies in telugu jms
Mega Family

మెగా ఫ్యామిలీలో దాదాపు అరడజనుకుపైగా హీరోలు ఉన్నారు. ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి ఫార్ములాలో వారు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఇక మెగాస్టార్, పవన్ స్టార్ టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. మిగతావారంతా టాలీవుడ్ లో హీరోలుగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.

కాని అందరు హిట్ సినిమాలు చేయలేక పోతున్నారు. అందులోను మెగా హీరోలు కొంత మంది సినిమాల విషయంలో చాలా స్లోగా వెళ్తున్నారు. ఈక్రమంలో ఓ మెగా హీరో మాత్రం రెండేళ్లుగా సినిమా చేయడంలేదు. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు సినిమాలు చేయడంలేదు. కారణం ఏంటి? 

Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?
 

Mega Hero Vaishnav Tej Has Rejected 100 Scripts in 2 Years and Stayed Away from Movies in telugu jms

మెగా హీరోలలో మెగా మేనళ్ళుల్లుగా ఇండస్ట్రీలోకి వచ్చారు సాయి ధుర్గతే, వైష్ణవ్ తేజ్. ఈ ఇద్దరు హీరోలు చిరంజీవి చెల్లెలు కొడుకులు. వీరిలో సాయి ధుర్గ్ తేజ్ మాత్రం హీరోగా నిలబడ్డాడు. స్టార్ హీరో కాకపోయినా,వరుస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నా, ఫామ్ లో ఉండటానికి ట్రైచేస్తున్నాడు. ఇమేజ్  కోల్పోకుండా కాపాడుకుంటున్నాడు. అయితే వైష్ణవ్ తేజ్ మాత్రం గత రెండేళ్ళుగా సినిమాలు చేయకుండా అయిపోయాడు. అవకాశాలు లేవా అంటే.. మెగా హీరోలకు ఛాన్స్ లు లేకపోవడమేంటి..? నిర్మాతలు ఈ యంగ్ హీరో కోసం ఎదురుచూస్తున్నారు. 

Also Read: సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?


పెద్ద పెద్ద నిర్మాతలు వైష్ణవ్ తేజ్ కోసం ఎదురుచూస్తున్నారు. కథ ఓకే చేస్తే సినిమాలు చేయడానికి సై అంటున్నారు. కాని వైష్ణవ్ తేజ్ మాత్రం ఒక్క కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదట. కొంత మంది నిర్మాతలకు సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు వైష్ణవ్. కాని కథ మాత్రం సెలక్ట్ అవ్వలేదట. అన్నపూర్ణ లాంటి పెద్ద బ్యానర్ లో కూడా వైష్ణవ్ తేజ్ సినిమా చేయాల్సి  ఉంది. వైష్ణవ్ తేజ్ ముందుకు రావడంలేదు. 
 

Also Read: రాజేంద్రప్రసాద్ కు రమాప్రభ ఏమవుతుందో తెలుసా? ఇద్దరి మధ్య బంధుత్వం ఏంటి?

అంతే కాదు దాదాపు రెండేళ్ళలో 100 కథల వరకూ విన్నాడట ఈ హీరో. కాని ఏ కథకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంలేదు. ఫస్ట్ సినిమా ఉప్పెనతో  స్టార్ గా మారాడు వైష్ణవ్. ఈసినిమాకు జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. కాని ఆతరువాత ఆయన వరుసగా నటించిన కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ , ఆది కేశవ’ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. 2023 చివర్లో ‘ఆదికేశవ’ రిలీజ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఏ సినిమా చేయలేదు మెగా మేన్లుడు. 

Also Read: పుష్ప, రంగస్థలం మిక్స్ చేసినట్టుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్. Rc16 టైటిల్ రిలీజ్

Mega Family

కనీసం కొత్త సినిమా ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు. నిర్మాతలు మాత్రం ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారట. ఇన్ని కథలు విన్న ఈ హీరో.. ఒక్క సినిమా అయినా ఒకే చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తే బాగుండు అనుకుంటున్నారట. మంచి సినిమాతో ఆడియన్స్ మందుకు వచ్చి సాలిడ్ రీ ఎంట్రీ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి వైష్ణవ్ తేజ్ ఏం చేస్తాడో ఏంటో చూడాలి. కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో కూడా చూడాలి. 

Latest Videos

vuukle one pixel image
click me!