రాజేంద్ర ప్రసాద్, రమాప్రభ మధ్య చాలా దాగ్గర బంధుత్వం ఉంది. రాజేంద్ర ప్రసాద్ కు రమా ప్రభ పిల్లనిచ్చిన అత్త . తన కూతురిని రమా ప్రభ రాజేంద్ర ప్రసాద్ కు ఇచ్చారు. పిల్లలే లేని రమా ప్రభాకు రాజేంద్ర ప్రసాద్ అల్లుడు ఎలా అయ్యాడు.
రమా ప్రభ ఒంటరి జీవితం గడపడంతో .. ఆమె తన చెల్లెలి కూతురిని దత్తత తీసుకుని పెంచి పెళ్ళి చేశారు. ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిమెచ్చిన మంచి అల్లుడు కావాలి అనుకున్న రమా ప్రభ.. రాజేంద్ర ప్రసాద్ కు తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేశారు.
ఈరకంగా రమాప్రభ రాజేంద్ర ప్రసాద్ అత్తా అల్లుడు అయ్యారు. ఈమధ్యనే రాజేంద్ర ప్రసాద్ కూతురు గుండెపోటుతో మరణించారు. ఆయన జీవితంలో ఇది అతి పెద్ద విషాదంగా చెప్పవచ్చు. ఇక అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో మదనపల్లె వెళ్ళి.. అత్తగారింటో హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తుంటారు రాజేంద్ర ప్రసాద్. ఆ వీడియోలు కూడా రమాప్రభ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో చూడవచ్చు.