Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?

Published : Jul 27, 2026, 09:43 PM IST

Ntr Injury: ఎన్టీఆర్‌ కి గాయాలయ్యాయి. ఆయన భుజానికి గాయమైనట్టు టీమ్‌ వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం ఎనిమిది వారాలపాటు బెడ్‌ రెస్ట్ అవసరం అని తెలిపింది.

PREV
13
ఎన్టీఆర్‌ భుజానికి గాయం

టాలీవుడ్‌ ని గాయాలు వెంటాడుతున్నాయి. మొన్న బాలయ్య గాయపడ్డారు. మరోవైపు రామ్‌ చరణ్‌ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనకు మణికట్టు ఆపరేషన్‌ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా గాయపడ్డారు. ఆయన  ఈ రోజు(సోమవారం) సాయంత్రం గాయపడ్డారట. తాజాగా ఎన్టీఆర్‌ టీమ్‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఎన్టీఆర్‌ భుజానికి గాయమైందని, ఈ విషయాన్ని చెబుతున్నందుకు చింతిస్తున్నట్టు వెల్లడించారు.

23
ఎన్టీఆర్‌ భుజానికి గాయం, 8 వారాలు రెస్ట్

`ఈ రోజు సాయంత్రం NTR భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని తెలియజేయడానికి చింతిస్తున్నాము. క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం, ఆయన పూర్తిగా, సజావుగా కోలుకునేందుకు ఆరు నుండి ఎనిమిది వారాల పాటు సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తారక్‌ ఆరోగ్యం, కోలుకునేదానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో తెలియజేస్తూనే ఉంటాము. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు` అని టీమ్‌ వెల్లడించింది.

33
డ్రాగన్‌ షూటింగ్‌ లో గాయాలు?

అయితే ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలను టీమ్‌ వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు తారక్‌. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా చేస్తోంది. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతుంది. బహుశా ఈ మూవీ చిత్రీకరణలోనే ఆయన భుజానికి గాయమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories