రామ్ చరణ్ మణికట్టు సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించాలనే ఉద్దేశంతో, అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ( Dr. Alejandro Badia) , ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. చేతి, మణికట్టు శస్త్రచికిత్సలు, ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజరీల చికిత్సలో ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నిపుణులు. సాధారణంగా ఆయన అపాయింట్‌మెంట్ పొందడమే ఎంతో కష్టమైన విషయం. అలాంటి ఆయన ప్రత్యేకంగా రామ్ చరణ్ కోసం రావడం విశేషం. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా ( Dr. Alejandro Badia), డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ అలాగే వారి నిపుణుల బృందం కలిసి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.