ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన సమంత.. ఆ మూవీ పేరు చెప్పేందుకు కష్టాలు, 'ఏ మాయ చేశావే' ప్రస్తావన

First Published | Oct 14, 2021, 10:33 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' (EMK) దిగ్విజయంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ తనదైన శైలిలో షోలో పాల్గొనే వారికి ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఆట రసవత్తరంగా సాగడంతో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' (EMK) దిగ్విజయంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ తనదైన శైలిలో షోలో పాల్గొనే వారికి ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఆట రసవత్తరంగా సాగడంతో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.అప్పుడప్పుడూ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సెలెబ్రిటీలు కూడా సందడి చేస్తున్నారు. ఓపెనింగ్ ఎపిసోడ్ కి రాంచరణ్ అతిథిగా హాజరయ్యాడు. ఇటీవల రాజమౌళి, కొరటాల శివ కలసి ఈ షోలో పాల్గొన్నారు. 

కాగా దసరా సందర్భంగా నేటి ఎపిసోడ్ లో Samantha మెరిసింది. సమంత ప్రత్యుష ఫౌండేషన్ కోసం డబ్బు గెలుచుకునేందుకు ఈ షోలో అతిథిగా పాల్గొనింది. Jr NTR, సమంత ఇద్దరూ ప్రేక్షకులకు మంచి వినోదం అందించారు. ఎప్పటిలాగే సమంత తన క్యూట్ లుక్స్, మాటలతో మెప్పించింది. ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానాలు ఇస్తూ రూ 25 లక్షల డబ్బు గెలుచుకుంది. సమంత పాల్గొన్న ఈ ఎపిసోడ్ లో చాలా విశేషాలు ఉన్నాయి. 


మొదట సమంతకు చాలా సులువైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు సామ్ అలవోకగా సమాధానాలు ఇచ్చింది. వ్యాయామ శాల, కుక్కల జాతి సంబందించిన ప్రశ్నలు సామ్ కి ఎదురయ్యాయి. ఇక శకుంతల, దుశ్యంతుడి కుమారుడు ఎవరు అంటూ మరో అతి సులువైన ప్రశ్న సమంతని ఎన్టీఆర్ అడిగారు. 'భరతుడు' అంటూ సమంత సరైన సమాధానం ఇచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సో సమంతకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కేక్ వాక్ లాంటిదే. 

మరో ప్రశ్నగా ఎన్టీఆర్ ఓ సాంగ్ ని ప్లే చేశారు. 'ఇంకా ఏదో ఇంకా ఏదో' అంటూ సాగే పాట అది. ఈ సాంగ్ ఏ చిత్రంలోనిది అని ఎన్టీఆర్ సామ్ ని ప్రశ్నించాడు. ప్రేక్షకులంతా చాలా సులువుగా సామ్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుంది అనుకున్నారు. కానీ సమంత చాలా కష్టపడింది. ఎట్టకేలకు 'డార్లింగ్' అంటూ సరైన సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా కాజల్ కు తాను అభిమానిని అని పేర్కొంది. ఆమె చాలా అందంగా ఉంటుంది అని ప్రశంసించింది. 

Darling చిత్రం గురించి మాట్లాడుతూ.. ఏ మాయ చేసావే చిత్రం గురించి కూడా సమంత నోరు విప్పింది. ఈ రెండు చిత్రాలు కొన్ని నెలల గ్యాప్ లో ఒకే ఏడాది రిలీజ్ అయ్యాయి అని సామ్ తెలిపింది. Naga Chaitanya తో కలసి సమంత నటించిన తొలి చిత్రం అదే. ఆమెతో డెబ్యూ మూవీ కూడా. 

ఈ షోలో సమంత ఒకరకంగా ఎన్టీఆర్ కు చుక్కలు చూపించిందనే చెప్పాలి. తాను చెప్పిన సమాధానం సరైనదో కాదో అని టెన్షన్ పడడం.. ఆన్సర్ ని ఫిక్స్ చేయమంటారా అని ఎన్టీఆర్ అడిగితే సైలెంట్ గా ఉండడం.. డౌట్ గా ఫిక్స్ చేయండి అని మళ్ళీ వద్దు అని వారించడంతో ఎన్టీఆర్ సామ్ పై సరదాగా విసుక్కున్నాడు. ఇదంతా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనింగ్ గా మారింది. 

అలాగే సమంత మాట్లాడుతూ తాను RRR చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. రాంచరణ్ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ అద్భుతం అంటూ ప్రశంసించింది. ఎన్టీఆర్ కూడా సమంత నటనని ప్రశంసించారు. అప్పటి మహానటి సావిత్రి గారు అయితే.. ఇప్పటి మహానటి సమంత అని కితాబిచ్చాడు. 

మొత్తంగా Evaru meelo koteeswarulu షోలో సమంత అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ రూ 25 లక్షల నగదు గెలుచుకుంది. అంతటితో నేటి ఆట ముగిసింది. దీనితో సమంత ఆట 25 లక్షల వద్దే ఆగిపోయింది. 

Also Read: స్వర్గం నుంచి దిగివచ్చిన దేవకన్యలా అనసూయ.. పెళ్ళికూతురిలా మైండ్ బ్లోయింగ్ ఫోజులు

Latest Videos

click me!