స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ రెడ్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న `జాతిరత్నాలు` చిట్టి.. ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరేమో!

First Published | Oct 14, 2021, 7:39 PM IST

`జాతిరత్నాలు` చిత్రంలో అల్లరి నటనతో కుర్రాళ్ల గుండెల్లోకి వెళ్లిపోయింది ఫరియా అబ్దుల్లా. అందులో చిట్టిగా ఈ బ్యూటీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా మెరిసిన ఈ భామ ఇప్పుడు రెడ్‌ శారీలో ఘాటెక్కిస్తుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.

`జాతిరత్నాలు` చిత్రంలో చిట్టి పాత్రతో ఓవర్ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది ఫరియా అబ్దుల్లా. నవీన్‌పొలిశెట్టితో ఈ బ్యూటీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంతేకాదు కోర్ట్ సీన్‌లోనూ తన నటనని, ఫన్‌ని పీక్‌లోకి తీసుకెళ్లింది. సినిమా సక్సెస్‌ కీలక భూమిక పోషించింది. 

ఇప్పుడీ `జాతిరత్నాలు` చిట్టి రెచ్చిపోయింది. స్లీవ్‌ లెస్‌ రెడ్‌ శారీలో హోయలు పోయింది. కిల్లింగ్‌ లుక్స్ తో, పిచ్చెక్కించే పోజులతో కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. నెట్టింట దుమారం రేపుతుంది. ప్రస్తుతం ఫరియా పంచుకున్న ఈ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. 


కర్లీ హెయిర్‌, క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో కవ్విస్తూ, అమాయకపు చూపులతో గిలిగింతలు పెడుతుంది ఫరియా. `జాతిరత్నాలు` చిత్రంతో టాలీవుడ్‌లోనూ పాపులర్‌ కావడమే కాదు, సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. నెట్టంట క్రేజీ భామగా మారిపోయింది ఫరియా. 

ఈ క్రేజ్‌ని అవకాశాలను అందుకోవడంలోనూ వాడుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అఖిల్‌, పూజా హగ్గే కలిసి నటించిన `మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌`లోనూ కీలక పాత్రలో మెరవబోతుంది. ఆడియెన్స్ ని సర్ప్రైజ్‌ చేయబోతుంది ఫరియా. ఇటీవల విడుదల చేసిన ప్రోమోల్లో ఇప్పటికే సందడి చేసింది. ఫరియా. 

మరోవైపు మరో క్రేజీ ఆఫర్‌ ఫరియాని వరించిందట. మంచు విష్ణుకి జోడిగా కనిపించబోతుందని సమాచారం. `ఢీ`కి సీక్వెల్‌గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. 

అంతేకాదు మాస్‌ మహారాజా రవితేజ68వ చిత్రంలోనూ హీరోయిన్గా ఫరియానే తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదే నిజమైతే ఫరియా కెరీర్‌కి బిగ్‌ బ్రేక్‌ రాబోతుందని చెప్పొచ్చు. 

అందుకు తగ్గట్టుగానే ఫరియా కూడా రెచ్చిపోతుంది. తన గ్లామర్‌ ఫోటోలతో నెట్టింట దుమారం రేపుతుంది. మేకర్స్ కంట్లో పడేందుకు తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. అందాల ఆరబోతకి కూడా తాను సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. తనని ఎన్ని యాంగిల్స్ లో చూపించొచ్చే మేకర్స్ కి హింట్‌ ఇస్తుంది ఫరియా. 
 

అందుకు తగ్గట్టుగానే ఫరియా కూడా రెచ్చిపోతుంది. తన గ్లామర్‌ ఫోటోలతో నెట్టింట దుమారం రేపుతుంది. మేకర్స్ కంట్లో పడేందుకు తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. అందాల ఆరబోతకి కూడా తాను సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. తనని ఎన్ని యాంగిల్స్ లో చూపించొచ్చే మేకర్స్ కి హింట్‌ ఇస్తుంది ఫరియా. 
 

Latest Videos

click me!