రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న `VD14` సినిమా టైటిల్ ప్రకటించారు. `రణబలి` అని పేరు పెట్టిన ఈ సినిమా, బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది.
విజయ్ దేవరకొండకు `గీత గోవిందం` తర్వాత సరైన హిట్ లేదు. అభిమానులు భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో `VD14`పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది అభిమానుల ఆకలి తీర్చే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు.
25
రణబలి` టైటిల్ ప్రకటన
రిపబ్లిక్ డే సందర్భంగా `రణబలి` టైటిల్ ప్రకటించారు. ఇది 1878 నాటి కథ. బ్రిటిష్ వారు భారతీయులను హింసించి, దోచుకున్నారు. ఈ నేపథ్యంలో పుట్టిన రణబలి, బ్రిటిష్ వారిపై ఎలా పగ తీర్చుకున్నాడనేదే కథ.
35
విజయ్ ఎంట్రీ అదిరింది
ఈసినిమాలో రణబలిగా విజయ్, జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. గుర్రంపై బ్రిటిష్ అధికారిని లాక్కెళ్లే విజయ్ ఎంట్రీ అదిరింది. 1854-1878 నాటి నిజ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ పాన్-ఇండియా సినిమాపై అంచనాలు పెరిగాయి.
`టాక్సీవాలా` తర్వాత విజయ్-రాహుల్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` తర్వాత రష్మిక, విజయ్ మళ్లీ జంటగా నటిస్తున్నారు. ఫిబ్రవరిలో వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. రీసెంట్ గా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరగబోతున్నాయి.
55
కమల్ సినిమాతో పోల్చుతున్న అభిమానులు..
విజయ్ దేవరకొండ లుక్, ఇండియన్ 3 గ్లింప్స్‌లోని కమల్ లుక్‌లా ఉంది. గుర్రంపై సీన్, బ్రిటిష్ కథ నేపథ్యం కూడా ఒకేలా ఉన్నాయి. దీంతో ఇండియన్ 3 కథనే `రణబలి`గా తీస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒక వేళ కథ ఒకేలా ఉంటే.. విజయ్ సినిమాకు చిక్కులు తప్పవా అనే చర్చ జరుగుతోంది. అయితే ఇది కేవలం రూమర్ గానే వినిపిస్తోంది. రెండు సినిమాలకు సంబంధం ఉండకపోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.