శోభన్‌ బాబు క్రేజ్‌ చూసి డౌన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా? అస్సలు ఊహించరు

Published : Jul 16, 2025, 01:40 PM ISTUpdated : Jul 16, 2025, 04:28 PM IST

ఎన్టీ రామారావు కెరీర్‌ పరంగా కొంత డౌన్‌ ఉన్న సమయం అది. శోభన్‌ బాబు స్టార్‌గా పీక్ లో ఉన్నారు. సోగ్గాడి క్రేజ్‌ని చూసిన రామారావు రియాక్షన్‌ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

PREV
15
శోభన్‌ బాబు క్రేజీపై ఎన్టీఆర్‌ కామెంట్స్

ప్రారంభంలో తెలుగు సినిమాని శాసించిన స్టార్స్ లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులు నిలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కో జోనర్‌లో మూవీస్‌ చేస్తూ రాణించారు. తమకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని, క్రేజ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. 

ఎన్టీఆర్‌ ఎక్కువగా పౌరాణికాలు, యాక్షన్‌ చిత్రాలు చేశారు. మరోవైపు నాగేశ్వరరావు జానపద చిత్రాలు, ప్రేమ కథలు, ఫ్యామిలీ సినిమాలు చేశారు.

 వారి తర్వాత యాక్షన్‌, కమర్షియల్‌ బాటలో కృష్ణ, కృష్ణంరాజు వెళితే, నాగేశ్వరరావు బాటలో శోభన్‌ బాబు వెళ్లారు. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ చిత్రాలకు పెద్ద పీఠ వేశారు సోగ్గాడు. అదే ఆయన సక్సెస్‌కి కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

25
కెరీర్‌ పీక్‌లో శోభన్‌ బాబు

ఒక దశలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లను డామినేట్‌ చేసే స్థాయికి కృష్ణ, శోభన్‌ బాబు ఎదిగారు. అయితే రామారావు `ఎదురులేని మనిషి` సినిమా చేసే సమయంలో ఆయన డౌన్‌లో ఉన్నారట. 

ఆయన నటించిన ముందు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొంత స్ట్రగులింగ్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఆ సమయంలో శోభన్‌ బాబు బాగా రైజ్‌ అయ్యారు. ప్రేమ కథలు, ఫ్యామిలీ చిత్రాలతో దుమ్ములేపుతున్నారు. 

పైగా సోగ్గాడి చిత్రాలు కలర్‌లో రూపొందుతున్నాయి. కలర్‌ మూవీస్‌ ఎరా స్టార్ట్ అయ్యింది ఆయనతోనే. స్టార్‌గా శోభన్‌ బాబు కెరీర్‌ పీక్‌లో ఉంది.

35
సోగ్గాడితో సినిమాలకు క్యూ కట్టి స్టార్ ప్రొడ్యూసర్స్

దీంతో టాలీవుడ్‌లోని బిగ్‌ ప్రొడ్యూసర్స్ అంతా సోగ్గాడితో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారట. ఓ సారి `ఎదురులేని మనిషి` సినిమాకి సంబంధించిన సాంగ్‌ షూటింగ్‌ జరుగుతుంది. అది విజయా గార్డెన్‌లో. 

టేక్‌ ఓకే అయ్యిందని కబురు వస్తే, ఎన్టీఆర్‌.. నిర్మాత అశ్వినీదత్‌ కారులో వెళ్లారు. వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న స్టూడియో నుంచి శోభన్‌ బాబు బయటకు వస్తున్నారట. అది లంచ్‌ బ్రేక్‌. 

ఆ సమయంలో శోభన్‌ బాబుని కలిసేందుకు టాలీవుడ్‌లోని బిగ్‌ స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా వచ్చారట. జగపతి రాజేంద్రప్రసాద్‌, రామానాయుడు ఇలా అప్పుడు టాప్‌లో ఉన్నా నిర్మాతలంతా శోభన్‌ బాబుని కలిసి బయటకు వస్తున్నారట. ఆయన చుట్టూ సందడి వాతావరణం ఉందట.

45
సోగ్గాడి క్రేజ్‌ని చూసిన రామారావు మాట బయటపెట్టిన అశ్వినీదత్‌

అశ్వినీదత్‌తో కలిసి కారులో వెళ్తున్న రామారావు ఇది చూసి.. `ఆహా.. ఇప్పుడు బ్రదర్‌ టైమ్‌ నడుస్తుంది` అంటూ `బ్రదర్‌ విషయంలో చాలా సంతోషంగా ఉంద`ని తన కల్మషం లేని గొప్ప మనసుని చాటుకున్నారట రామారావు. 

ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్‌ ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే టాక్‌ షోలో వెల్లడించారు. ఆ టైమ్‌లో రామారావు కాస్త డౌన్‌లో ఉన్నారని, కానీ తనకు పోటీగా ఉన్న హీరో గురించి అలా పాజిటివ్‌గా, గొప్పగా రియాక్ట్ కావడం ఆయనకే చెల్లిందని, దట్‌ ఈజ్‌ రామారావు అని వెల్లడించారు.

55
కెరీర్‌ పీక్‌లోకి వెళ్లిన రామారావు

`ఎదురులేని మనిషి`కి ముందుకాస్త డౌన్‌లో ఉన్న రామారావు ఈ మూవీతో విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారని, ఆ తర్వాత `అడవి రాముడు`, `వేటగాడు` వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ తో మరోసారి కెరీర్‌ లో పీక్‌కి వెళ్లారని తెలిపారు అశ్వినీదత్‌. 

ఆ తర్వాత రామారావు రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. టీడీపీని స్టార్ట్ చేసి ఎన్నికల్లోకి వెళ్లిన ఫస్ట్ టైమ్‌లోనే సీఎంగా గెలుపొందారు. సీఎంగా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల మన్ననలు పొందారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories