ఫారెన్ లో షూటింగ్ జరిగిన మొదటి తెలుగు సినిమా ఏదో తెలుసా..? హీరో ఎవరనుకుంటున్నారు..?

First Published | Jul 28, 2024, 7:58 AM IST

ఫారెన్ లో షూటింగ్ అంటే ఇప్పుడు పెద్ద విషయం కాదు. కాని ఒకప్పుడు పెద్ద సినిమా అయితేనే ఫారెన్ లో షూట్ కు వెళ్ళేవి. అసలు తెలుగులో మొదటిసారి ఫారెన్ షూట్ కు వెళ్ళిన సినిమా ఏంటి..? ఆ సినిమాకు హీరో ఎవరు..? 

ఇప్పుడంటే ప్రతీ చిన్న సినిమా షూటింగ్ ఫారెన్ లో జరుపుకుంటున్నారు. బడ్జెట్ తో సబంధం లేకుండా... ప్రతీ సినిమా ఒక్క  సాంగ్ కోసం అయినా ఫారెన్ వెళ్తుంటారు. అయితే ఒకప్పుడు మాత్రం స్టార్ హీరోల సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే ఫారెన్ వరకూ వెళ్ళి షూటింగ్ జరిగేవి. అది కూడా ఓన్లీ పాటల కోసమే విదేశాలకు వెళ్ళేవారు. 
 

ఉపేంద్రతో హీరోయిన్ ప్రేమ ప్రేమాయణం నిజ‌మేనా..? క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి..

 ప్ర‌స్తుతం  రోజుల్లో చాలా కామ‌న్ అయిపోయింది. నేచురల్ గా ఉండాలని చిన్న సన్నివేశాలకు కూడా  కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టి  ఫారెన్ లొకేషన్లు వెతుక్కుంటూ వెళ్తున్నారు. కొంత మంది మాత్రం రియ‌ల్ లోకేష‌న్స్  కోసం గట్టిగా ఖర్చు పెట్టుకుని మరీ.. ఫారెన్ కు చెక్కేస్తున్నారు. నిర్మాతలు కూడా వీటికోసం ఖర్చుపెట్టడానికి వెనకాడటంలేదు. అయితే ఓ నలబై యాబై ఏళ్ళ క్రితం మాత్రం  సినిమా షూటింగ్స్ అంటే స్టూడియోల్లో మాత్రమే జరిగేవి. ఏ సీన్ అయినా.. సెట్స్ వేసుకుని చేసుకునేవారు. 

Latest Videos


అప్పట్లో  ఫారెన్ లో షూటింగ్ అంటే భయపడేవారు నిర్మాతలు. మరి అలాంటి రోజుల్లో కూడా  విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..? ఆ సినిమాకు హీరో ఎవరో తెలుసా..? ఆ సినిమా ఏదో కాదు  హరే కృష్ణ హలో రాధ. ఈసినిమాకు హీరో సూపర్ స్టార్ కృష్ణ. సి.వి.శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీ ప్రియ హీరోయిన్ గా నటించింది. 
 

రతి అగ్నిహోత్రి, కైకాల సత్యనారాయణ, సత్తార్, ప్రకాష్ లాంటి సీనియర్ నటులు సందడి చేసిన ఈసినిమా రెండు భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే తెలుగు లో కృష్ణ హీరోగా నటిస్తే.. తమిళంలో శివ చంద్రన్ హీరోగా నటించారు. ఈరెండు వర్షన్లు ఒకేసారి తెరకెక్కించడం విశేషం.

 శ్రీ భరణీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్ బ్యాన‌ర్ పై ఏక‌కాలంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను నిర్మించారు. తెలుగు వెర్షన్‌ లో కృష్ణ, తమిళ వెర్షన్‌ శివ చంద్రన్‌ హీరోలుగా నటించారు. ఈసినిమా మొదటిసారి ఫారెన్ షూట్ జరుపుకున్న తెలుగు సినిమాగా రికార్డ్ సాధించింది. అయితే ఈసినిమాలో ఫారెన్ షూట్ ఏం చేశారంటే..? 
 

హరే కృష్ణ హలో రాధలో ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా మూడొంతులు సినిమా మొత్తాన్ని  అమెరికాలోనే షూటింగ్ చేశారట.  అప్పటికే కృష్ణతో బంధం పెంచుకున్న విజయనిర్మల.. ఈమూవీలో నటించకపోయినా.. ఆయనతో కలిసి  అమెరికాకు విజయనిర్మల కూడా వెళ్లారు. వంటల్లో స్పెషలిస్టు అయిన విజ‌య‌నిర్మ‌ల‌.. అమెరికాలో ఉన్నన్ని రోజులు టీమ్ కు ఆమే వంట కూడా చేసి పెట్టారట. 

ఇక ఈసినిమాలో కృష్ణ అమెరికా సీన్స్ అద్భుతంగా ఉంటాయి. అప్పట్లో అమెరికా ఎలా ఉంటుందో  ఇప్పటి తరం జనాలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇక 1980 అక్టోబర్ 16న హరే కృష్ణ హలో రాధ  రిలీజ్ అయ్యింది. అప్పటికే కృష్ణ సినిమాల పరంగా చాలా రికార్డ్ సాధించారు. ఫస్ట్ కౌవ్ బాయ్ మూవీ, ఫస్ట్ కలర్ మూవీ, ఫస్ట్ యాక్షన్ హీరో.. ఇలా రికార్డ్స్ చాలా ఉన్నాయి కృష్ణ పేరుమీద. ఫస్ట్ ఫారెన్ షూటింగ్ రికార్డ్ కూడా కృష్ణకే దక్కింది. 

click me!