త్రివిక్రమ్‌ చేసిన పనికి టీనేజ్‌ అమ్మాయిలు నరేష్‌ వెంటపడుతున్నారా?.. సీనియర్‌ నటుడు ఓపెన్‌ స్టేట్‌మెంట్‌

Published : Jul 27, 2024, 11:41 PM IST

సీనియర్‌ నటుడు నరేష్‌.. ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. టీనేజ్‌ అమ్మాయిల ఫాలోయింగ్‌కి సంబంధించిన ఆయన వ్యాఖ్యలు వైల్‌ అవుతున్నాయి.  

PREV
15
త్రివిక్రమ్‌ చేసిన పనికి టీనేజ్‌ అమ్మాయిలు నరేష్‌ వెంటపడుతున్నారా?.. సీనియర్‌ నటుడు ఓపెన్‌ స్టేట్‌మెంట్‌

వీకే నరేష్‌ మొన్నటి వరకు వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆయన ఇప్పుడు కొంత గ్యాప్‌తో మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో `వీరాంజనేయులు విహారయాత్ర` పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నరేష్‌ ప్రధాన పాత్ర పోషించారు. అనురాగ్‌ పాలుట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది.  

25
Naresh pavitra

ఈ కార్యక్రమంలో పవిత్ర లోకేష్‌ పాల్గొని టీజర్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నరేష్‌పై ప్రశంసలు కురిపించింది. పాన్‌ ఇండియా ఫైనెస్ట్ యాక్టర్‌ అంటూ ప్రశంసలు కురిపించింది. అనంతరం నరేష్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో ఇది ఒకటని, తన మైల్‌ స్టోన్‌ చిత్రాల్లో ఇది ఒకటి అని వెల్లడించాడు నరేష్‌. 

35

ఈ క్రమంలో ఆయన ఈ ఏజ్‌లోనూ కుర్రాడిలా యాక్ట్ చేస్తున్నారనే ప్రశ్నకి స్పందిస్తూ, తాను ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోయేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు నరేష్‌. త్రివిక్రమ్‌ చేసిన పని బయటపెట్టాడు. అమ్మాయిల ఫాలోయింగ్‌ గురించి వెల్లడించారు. 
 

45

తాను `అ ఆ` సినిమా చూశాక తనకు టీనేజ్‌ అమ్మాయిల ఫాలోయింగ్‌ పెరిగిందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అనంతరం కూల్‌గా అసలు విషయం రివీల్‌ చేశాడు. అమ్మాయిలంతా తనలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుందని, ఇలాంటి ఫాదర్‌ కావాలని కోరుకుంటున్నారని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు నరేష్‌. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. `అ ఆ` సినిమాని త్రివిక్రమ్‌ రూపొందించారు. ఇందులో సమంతకి ఫాదర్‌గా నటించాడు నరేష్‌. మదర్‌గా నదియా నటించగా, ఆమె సీరియస్‌గా, స్ట్రిక్ట్ గా ఉంటే, నరేష్‌ మాత్రం ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆ కోణంలో తనకు అమ్మాయిల ఫాలోయింగ్‌ పెరిగిందని చెప్పాడు నరేష్‌. అయితే దీనిపై కూడా ట్రోలింగ్‌ నడుస్తుంది. 

55
Naresh pavitra

 ఆయన ప్రధాన పాత్రలో నటించిన `వీరాంజనేయులు విహారయాత్ర` మూవీ ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. నరేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న నరేష్..సెకండ్‌ ఇన్నింగ్‌లో అదే జోరుని చూపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన ఇప్పుడు పవిత్ర లోకేష్‌తో నాల్గో పెళ్లికి రెడీ అవుతున్నాడు. తన పార్ట్‌ నర్స్ తో విడాకులకు సంబంధించిన కోర్ట్ చిక్కులు క్లీయర్‌ అయితే ఈ ఇద్దరు మ్యారేజ్‌ చేసుకోనున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories