ప్రభాస్ హీరోగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్ నిర్మించింది. ఈ మూవీ నుంచి రెండో పార్ట్ రాబోతుంది. మహభారతం ఎలిమెంట్లకి సైన్స్ ఫిక్షన్ జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్, మహాభారతం ఎలిమెంట్లు సినిమా విజయానికి కారణమయ్యాయని చెప్పొచ్చు.