`14 డేస్‌ గర్ల్ ఫ్రెండ్‌ ఇంట్లో` మూవీ రివ్యూ

Published : Mar 07, 2025, 03:45 PM IST

14 Days Girlfriend Intlo Movie Review: అంకిత్‌ కొయ్య, శ్రియా కొంతం జంటగా నటించిన మూవీ `14డేట్స్ గర్ట్ ఫ్రెండ్‌ ఇంట్లో`. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
15
`14 డేస్‌ గర్ల్ ఫ్రెండ్‌ ఇంట్లో` మూవీ రివ్యూ
14 days girlfriend intlo movie

14 Days Girlfriend Intlo Movie Review: `ఆయ్‌`, `కమిటీ కుర్రోళ్లు` చిత్రాలతో పాపులర్‌ అయ్యాడు అంకిత్‌ కొయ్య. ఇప్పుడు ఏకంగా హీరోగా టర్న్ తీసుకున్నాడు. ప్రస్తుతం `14డేస్‌ గర్ల్ ఫ్రెండ్‌ ఇంట్లో` అనే చిత్రంలో నటించారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. శ్రియ కొంతం హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషించారు.

శ్రీ హర్ష మన్నే దర్శకత్వం వహించిన ఈ మూవీని సత్య ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సత్య కోమల్‌ నిర్మించారు. #90s వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రాజశేఖర్ మేడారం విడుదల చేసిన ఈ మూవీ శుక్రవారం(మార్చి7)న విడుదలైంది. టీనేజ్‌ కుర్రాళ్లకి కావాల్సిన కంటెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

25
14 days girlfriend intlo movie review

కథః 
హర్ష(అంకిత్‌ కొయ్య) డైరెక్టర్‌ కావాలని కలలు కంటుంటాడు. క్రియేటివ్‌ కిసెస్‌(వెన్నెల కిశోర్‌) పెట్టిన యూట్యూబ్‌ ఛానెల్‌లో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. డేటింగ్‌ యాప్ ద్వారా ఆహాన(శ్రియ కొంతం) అనే అందమైన అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరులవ్‌లో పడతారు. పేరెంట్స్ పెళ్లికి ఊరెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఆహాన హర్షని ఇంటికి ఆహ్వానిస్తుంది. లవర్‌ పిలిస్తే హర్ష మరో ఆలోచన లేకుండా ఆమె ఇంటికి వెళ్తాడు. ఇద్దరు ఆ రోజు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

ఆ రోజు రాత్రి హర్ష ఆహాన ఇంట్లోనే ఉంటాడు. మార్నింగ్‌ వెళ్లిపోదామనుకునే సమయంలోనే సడెన్‌గా పేరెంట్స్ వస్తారు. పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని వాళ్లు అనుకోకుండా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. దీంతో హర్ష ఇంట్లోనే లాక్‌ అయిపోతాడు. వాళ్ల కంటపడకుండా మ్యానేజ్‌ చేస్తుంటారు. అంతలోనే కరోనా స్టార్ట్ అవుతుంది. ఆహాన ఫ్యామిలీపై అనుమానంతో అపార్ట్‌మెంట్‌ మేనేజర్‌ బయట నుంచి లాక్‌ చేస్తారు. దీంతో అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్న హర్ష ప్లాన్‌ బెడిసి కొడుతుంది.

ఇక అధికారులు వీరి ఫ్యామిలీని ఐసోలేషన్‌ సెంటర్‌కి పంపిస్తారు. కానీ హర్ష ఇంట్లోనే ఇరుక్కుపోతాడు. దీంతో ఆ 14 రోజులు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్ని రోజులు ఎలా ఉన్నాడు? బయటకు వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నాలేంటి? ఐసోలేషన్‌ పూర్తయ్యాక ఆహాన, హర్ష జీవితంలో చోటు చేసుకున్న షాకింగ్‌ ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన కథ. 
 

35
14 days girlfriend intlo movie review

విశ్లేషణః
లవర్‌ ఇంటికి వెళ్లిన కుర్రాడు ఆ ఇంట్లోనే ఇరుక్కుపోతే అన్ని రోజులు ఎలా ఉన్నాడు? ఎలా మ్యానేజ్‌ చేశాడు? బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు? ఈ క్రమంలో ఎలాంటి ఫన్నీ సన్నివేశాలు, ఎలాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేది సింపుల్‌గా ఈ మూవీ స్టోరీ. ఆద్యంతం ఫన్నీగా సాగుతుంది.

రొమాంటిక్‌ టచ్‌తో ప్రారంభమై, కామెడీ సన్నివేశాలతో సాగుతూ, క్రమంగా ఉత్కంఠకు దారితీస్తూ, చివరికి సీరియస్‌గా మారి, ఎమోషనల్‌ సంఘటనలకు దాసి తీస్తుంది. కథ ఎలా సుఖాంతం అయ్యిందనేది ఈ మూవీ స్టోరీ. కథగా సింపుల్‌ స్టోరీ. కానీ దాన్ని ప్రజెంట్‌ చేసిన తీరు బాగుంది. ఈ జనరేషన్‌ని దృష్టిలో పెట్టుకుని యూత్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు.

సందర్భాను సారంగా జనరేట్‌ అయ్యే కామెడీ ఇందులో హైలైట్‌. ప్రారంభంలో వెన్నెల కిషోర్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో చేసే చెత్త ఇన్‌స్పిరేషన్‌ వీడియోలతో స్టార్ట్ అవుతుంది. వ్యూస్‌ రాకపోగా, ట్రోల్స్ కి గురి కావడం, ఈ క్రమంలో కిషోర్‌ పడే తంటాలు నవ్వులు పూయిస్తాయి. మరోవైపు ఛాటింగ్‌లతో అంకిత్‌ కొయ్య, శ్రియా కొంతం లవ్‌, రొమాన్స్ కొత్తగా ఉంటుంది.

ఫ్రెష్‌ ఫీలింగ్‌ని తెస్తుంది. ఆ తర్వాత లవర్‌ ఇంట్లో ఉండటంతో ఇంట్లో నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు విఫలం కావడం, ఇంట్లో పేరెంట్స్ కి తెలియకుండా మ్యానేజ్‌ చేసే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. 

ఇక సెకండాఫ్‌లో లవర్‌ ఫ్యామిలీ అంతా ఐసోలేషన్‌ సెంటర్‌కి వెళ్లడం, తాను ఒక్కడే ఇంట్లో ఉండూ ఎంజాయ్ చేయడం, ఫుడ్‌ కోసం ఇబ్బంది పడటం, దుస్తుల కోసం ఇబ్బంది పడటం, ఆ అమ్మాయి డ్రెస్‌ వేసుకోవడం ఫన్నీగా ఉంటాయి. సరదాగా సాగుతూ, చివరికి ఎమోషనల్‌గా మారుతుంది. విషయం తెలియడంతో సీరియస్‌ అవుతుంది.

అది ప్రేమ, రిలేషన్‌, పేరెంట్స్ కేరింగ్‌ భావోద్వేగానికి గురి చేస్తుంది. నవ్విస్తూనే గుండె బరువెక్కించి, ఆలోచింప చేస్తుంది. అయితే కామెడీ అన్ని చోట్ల వర్కౌట్‌ కాలేదు. కొంత అసహజంగా అనిపిస్తాయి. కొన్ని సీన్లు బలవంతంగా పెట్టిన ఫీలింగ్‌ కలుగుతాయి. అక్కడక్కడ కొంత ల్యాంగ్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం అందరికి ఇదొక సందేశంగా నిలుస్తుంది.

పేరెంట్స్ స్వేచ్ఛని పిల్లలు ఎలా మిస్‌ యూజ్‌ చేస్తున్నారు. నేటి యువత ఎలా ఉంది? అదే సమయంలో పేరెంట్స్ కి చెప్పడం వల్ల సమస్యలు ఎలా సాల్వ్ అవుతాయి. ఏది చేయాలి? ఏది చేయకూడదు, పిల్లల అభిప్రాయాలకు రెస్పెక్ట్ చేయడం, ఇష్టాఇష్టాలకు ప్రయారిటీ ఇవ్వడం వంటి అంశాలను చర్చించిన తీరు బాగున్నాయి. ఇది పేరెంట్స్ కి, పిల్లలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. 
 

45
14 days girlfriend intlo movie review

నటీనటులుః 
హర్ష పాత్రలో అంకిత్‌ కొయ్య చాలా బాగా నటించాడు. పాత్రలో జీవించాడు. బాగా సెట్‌ అయ్యాడు. ఇటీవల వరుస విజయాలతో రాణిస్తున్న అంకిత్ కి ఇది హీరోగా మంచి విజిటింగ్‌ కార్డ్ లాంటి మూవీ అవుతుంది. అతనికి మంచి ఫ్యూచర్‌ ఉందని చెప్పొచ్చు. ఇక ఆహాన పాత్రలో శ్రియ కొంతం సైతం బాగా చేసింది. చాలా సహజంగా నటించింది.

హీరోయిన్‌ అనే ఫీలింగ్‌ కలగడు. మనింట్లో అమ్మాయిలా, లేదంటే పక్కింటి అమ్మాయిగానే అనిపిస్తుంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది అనడం కంటే పాత్రలో జీవించింది అని చెప్పాలి. మెయిన్‌గా వీరి పాత్రల చుట్టూనే సినిమా సాగుతుంది. ఇక వెన్నెల కిశోర్‌ కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఆయన పాత్ర ఫన్నీగా ఉంటుంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. 
 

55
14 days girlfriend intlo movie review

టెక్నీషియన్లుః 
ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఇదొక సినిమా అనే ఫీలింగ్‌ కలగదు. తెరపై ఓ జీవితాన్ని చూస్తున్నామనిపిస్తుంది. ఈ విసయంలో దర్శకుడు శ్రీ హర్ష మన్నేని అభినందించాల్సిందే. చాలా సహజంగా తెరకెక్కించాడు. డైలాగ్‌లు కూడా అంతే సహజంగా ఉన్నాయి. మధ్య మధ్యలో కొంత ల్యాగ్‌ ఫీలింగ్‌, బోర్‌ ఫీలింగ్‌ అనేది పక్కన పెడితే చాలా నీట్‌గా, చాలా క్లీన్‌గా ఈ మూవీని తెరకెక్కించడం విశేషం.

బోల్డ్ గా, శృతి మించిన రొమాన్స్ కి పోకుండా సినిమాని చాలా బాగా డీల్‌ చేశాడు. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రదీప్‌ రాయ్‌ ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. మార్క్ కే రాబిన్‌ సంగీతం ఆకట్టుకుంది. పాటలతోపాటు ఆర్‌ఆర్‌ ఆకట్టుకుంటుంది. కొత్త ఫీలింగ్‌ని కలిగిస్తుంది. షార్ట్ అండ్‌ స్వీట్‌గా ఈ మూవీ ఉండటం విశేషం. 

ఫైనల్‌గాః క్లీన్‌ లవ్‌, రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ `14డేట్స్ గర్ల్ ఫ్రెండ్‌ ఇంట్లో`. నవ్విస్తుంది, అలరిస్తుంది, భావోద్వేగానికి గురి చేస్తుంది, ఆలోచింప చేస్తుంది.
రేటింగ్‌ః 2.75
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories