బాలకృష్ణతో ఆ స్టార్ హీరోయిన్లు ఒక్క సినిమా కూడా నటించలేదు.. కారణం అదేనా.!

Published : Nov 25, 2025, 06:52 PM IST

Nandamuri Balakrishna: అప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటీమణులు.. నందమూరి బాలకృష్ణతో కలిసి ఒక్క చిత్రంలోనూ నటించలేదు.. ఎందుకంటే.?

PREV
15
హీరోహీరోయిన్ల లెక్కలు ఇవే..

సాధారణంగా ఏ హీరో లేదా హీరోయిన్ అయినా.. ఇండస్ట్రీలో మంచి ఫేం ఉన్న నటీనటులతో కలిసి పని చేయాలని అనుకుంటారు. అప్పుడే వారికి ఫాలోయింగ్, రెమ్యునరేషన్ రెండూ పెరుగుతాయి. నాడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రనటులతో నటించాలని ప్రతీ హీరోయిన్ కోరుకునేవారు. అయితే అప్పట్లో మంచి ఫేం ఉన్న హీరోయిన్లు శ్రీదేవి, కవిత, మాధవి.. బాలయ్యతో కలిసి ఒక్క చిత్రంలోనూ నటించలేదు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందామా..

25
స్టార్ హీరోయిన్.. కానీ అప్పటికి సైడ్ క్యారెక్టర్లే..

కవిత: అప్పుడు ఈమె చిరంజీవితో వరుసగా నాలుగైదు చిత్రాల్లో నటించింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్, కృష్ణతో కలిసి హీరోయిన్‌గా నటించింది. అయితే బాలకృష్ణతో మాత్రం ఈమె ఒక్క చిత్రంలోనూ నటించలేదు. దానికి కూడా కారణం లేకపోలేదు. 1983 నుంచి బాలయ్య సోలో హీరోగా మారి సినిమాలు చేస్తుండగా.. ఆ టైంలో రాధా, సుహాసిని వంటి నటీమణులు స్టార్ హీరోయిన్లుగా మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే ఆ సమయంలో కవితకు సైడ్ క్యారెక్టర్లు వస్తుండటంతో.. ఆమెకు బాలకృష్ణతో హీరోయిన్‌గా వర్క్ చేసే వక్షం రాలేదట.

35
అతిలోక సుందరితో నో మూవీ..

శ్రీదేవి: సీనియర్ ఎన్టీఆర్‌తో హీరోయిన్ శ్రీదేవి పలు హిట్ చిత్రాల్లో నటించింది. అయితే బాలకృష్ణ హీరోగా వచ్చేసరికి.. శ్రీదేవికి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావడం.. అక్కడే సినిమాలు చేయడంలో బిజీ అయిపోయింది. బాలకృష్ణతో 'భలే దొంగలు' అనే సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చినా.. అప్పటికే హిందీలో డజన్‌కు పైగా సినిమాలతో శ్రీదేవి బిజీగా ఉండటంతో.. ఆ ఆఫర్ తిరస్కరించిందట. అటు ఇండస్ట్రీలో మరో టాక్ ఏంటంటే.? బాలయ్య.. తన తండ్రితో నటించిన హీరోయిన్‌తో సినిమా చేయనని చెప్పడంతో.. ఆ మేరకు ప్రయత్నాలు జరగలేదని సమాచారం.

45
మెగా హీరోయిన్‌గా పేరు.. కానీ.!

మాధవి: ఈ హీరోయిన్ చిరంజీవితో కలిసి అత్యధిక సినిమాలు చేసి.. మెగా హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చేసరికి మాధవి ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలకృష్ణతో ఒక సినిమాలో నటించేందుకు ఈమెకు ఆఫర్ వచ్చిందట.. కానీ అప్పటికే చిరంజీవితో మూడు సినిమాల డీల్, అలాగే వేరే లాంగ్వేజ్‌లో కూడా పలు చిత్రాలు ఒప్పుకోవడంతో.. బాలయ్య, మాధవిల కాంబినేషన్ వర్కౌట్ కాలేదట. ఆపై విజయశాంతి, భానుప్రియ, రాధ లాంటి హీరోయిన్లతో బాలయ్య వరుసగా హిట్లు కొడుతుండడంతో దర్శకనిర్మాతలు ఇక కొత్త హీరోయిన్ల కోసం ఆలోచించలేదట.

55
డిసెంబర్ 5న అఖండ-2

ఇక బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అఖండ 2'. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. అటు ఇప్పటికే విడుదల పాటలు, ట్రైలర్ యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ దక్కించుకుంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories