ఎన్నో ఏళ్లుగా సినిమా రంగాన్ని వారసులు ఏలుతున్నారు. భాష ఏదైనా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం కామన్ అయిపోయింది. అయితే ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోతే వారసులుగా ఎంట్రీ ఇచ్చినా ఉపయోగం లేదు. వారసులుగా వచ్చి ఎదగలేకపోయినవారు ఎంతో మంది ఉన్నారు.
చాలా మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వారి టాలెంట్ ను నిరూపించుకుని. వారికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక టాలెంట్ లేక, తమను తాము నిరూపించుకోలేక రెండు మూడు సినిమాలకే బయటకు వెళ్ళిపోయినవారు కూడా ఉన్నారు.