తాను చేయాల్సిన మూవీలో చిరంజీవికి హీరోగా ఛాన్స్ ఇచ్చిన కమెడియన్, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా మారిందో తెలుసా

Published : Jul 04, 2025, 04:07 PM IST

ఓ కమెడియన్ హీరోగా నటించాల్సిన చిత్రం చిరంజీవి చేతుల్లోకి వెళ్ళింది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు ? ఆ చిత్రం ఏంటి ? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
చిరంజీవి రూమ్ మేట్స్ 

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో చాలా అద్భుతాలు జరిగాయి. అప్పట్లో చిరంజీవి ఎంతో చురుకుదనంతో ఉంటూ ఎవరికీ సాధ్యం కాని విధంగా డాన్సులు ఫైట్స్ చేస్తూ అగ్ర హీరోగా ఎదిగారు. మాస్ ప్రేక్షకులను చిరంజీవి కొన్ని దశాబ్దాల పాటు అలరించారు. తన ప్రతిభతో వరుస అవకాశాలు అందుకుంటూ చిరంజీవి ఉన్నత స్థాయికి ఎదిగారు.

చిరంజీవి కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నటుడు హరిప్రసాద్, కమెడియన్ సుధాకర్ తో కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. వీళ్ళు ముగ్గురూ రూమ్ మేట్స్. ఒకేసారి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఈ ముగ్గురూ ప్రయత్నించారు. ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ మాట్లాడుతూ చిరంజీవితో స్నేహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

25
కమెడియన్ నటించాల్సిన చిత్రంలో చిరంజీవికి హీరోగా ఛాన్స్ 

చిరంజీవి నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్లు. ఈ మూవీలో ముందుగా హీరోగా తనకే అవకాశం వచ్చిందని సుధాకర్ తెలిపారు.కానీ అప్పటికే నేను కొన్ని సినిమాలు చేస్తున్నాను. దీంతో ఈ మూవీ నేను చేయలేను కానీ చిరంజీవి ఉన్నాడు అతనిని తీసుకోండి బాగా చేస్తాడు అని సుధాకర్ చెప్పారట. ఆ విధంగా చిరంజీవికి పునాది రాళ్లు చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. 

సుధాకర్ మాట్లాడుతూ చిరంజీవి ఏదో నావల్ల హీరో అయిపోయాడు అనేది కరెక్ట్ కాదు. అతడికి అదృష్టం టాలెంట్ రెండు ఉన్నాయి. నేను చేయడం కుదరకపోయేసరికి ఆ అవకాశం చిరంజీవికి వెళ్ళింది. చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలో.. సుధాకర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా కూడా రాణించారు. ఆ తర్వాత కమెడియన్ అయ్యారు. చిరంజీవి నటించిన చాలా చిత్రాల్లో సుధాకర్ కమెడియన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరి మధ్య ఫ్రెండ్షిప్ మరింత బలపడింది.

35
చిరంజీవి హీరోగా సుధాకర్ నిర్మించిన చిత్రం

తాను ఎదగడమే కాదు తన స్నేహితుల ఎదుగుదలను కూడా చిరంజీవి కోరుకున్నారని సుధాకర్ తెలిపారు. సుధాకర్ నిర్మాణంలో చిరంజీవి ఓ చిత్రంలో నటించారు. ఆ మూవీ మరేదో కాదు యముడికి మొగుడు. చిరంజీవి రూమ్ మేట్స్ అయిన హరిప్రసాద్, సుధాకర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ గురించి సుధాకర్ మాట్లాడుతూ చిరంజీవితో సినిమా నిర్మించాలని హరిప్రసాద్ కి కోరిక ఉండేది.

45
స్నేహితుల ఎదుగుదల కోసం 

చిరంజీవితో సినిమా నిర్మిద్దామని ఒకసారి హరిప్రసాద్ నాకు చెప్పారు. దీంతో అప్పుడప్పుడు వెళ్లి చిరంజీవిని కలిసే వాళ్ళం. నీ డేట్లు ఇస్తే సినిమా నిర్మిస్తామని చిరంజీవికి చెప్పాం. దీంతో చిరంజీవి వెంటనే ఓకే అన్నారు. నేను మీకు సినిమా చేస్తే మీరు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. కాబట్టి తప్పకుండా చేస్తానని చిరంజీవి అన్నారు. ఆ విధంగా నేను హరిప్రసాద్, నారాయణరావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

55
చిరంజీవి ఫ్యామిలీతో పరిచయం

చిరంజీవి సతీమణి సురేఖ గారిని తాను ఎప్పుడూ వదినగారు అని పిలిచేవాడినని సుధాకర్ తెలిపారు. తాను సొంతంగా కారు డ్రైవ్ చేస్తూ చిరంజీవిని చాలా ఫంక్షన్స్ కి తీసుకెళ్లాను అని సుధాకర్ అన్నారు. మా ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉండేది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కూడా సుస్వాగతం లాంటి చిత్రాల్లో నటించానని.. పవన్ తనని అన్నయ్య అని పిలుస్తాడని సుధాకర్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories