ఇక `తమ్ముడు` సినిమా బిజినెస్ చూస్తే ఈ చిత్రానికి సుమారు రూ..75కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం. కాకపోతే దర్శకుడు వేణు శ్రీరామ్, హీరో పారితోషికం తీసుకోకుండా వర్క్ చేశారు.
దీంతో నిర్మాత దీనికి సుమారు యాభై కోట్లు పెట్టారట. అయితే బిజినెస్ పరంగా రికవరీ బాగానే ఉంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ హక్కులను సొంతం చేసుకుంది.
దీనికి రూ.20కోట్ల వచ్చాయట. అలాగే శాటిలైట్ రూ.15 కోట్లు, మ్యూజిక్ రైట్స్ కోటి వరకు వచ్చాయని సమాచారం. మరోవైపు థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే అయ్యిందట.
తెలుగు స్టేట్ రైట్స్ రూ.20కోట్లకు అమ్ముడు పోయాని, ఇతర స్టేట్స్, ఓవర్సీస్ రైట్స్ ఐదు కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఇదే నిజమైతే నిర్మాత చాలా వరకు సేఫ్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు. కానీ సినిమాని కొన్న బయ్యర్లకే నష్టాలు వచ్చే అవకాశం ఉంది.