అయితే ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఉంది. ఇందులో హింసాత్మక సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. వాటిని తొలగిస్తేనే యుఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు తెలిపింది. కానీ దిల్ రాజు ఆ సన్నివేశాలని తొలగించేందుకు అంగీకరించలేదు. అందువల్లే సెన్సార్ వాళ్ళు ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ అందించారు.
సినిమా థీమ్ కి హింసాత్మక సన్నివేశాలు కీలకమైనవి కావడంతో, వాటిని తక్కువ చేయకుండా అలాగే ఉంచాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా 'తమ్ముడు'కు ఎ సర్టిఫికేట్ వచ్చింది.
ఇది సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని రూపొందించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా. నితిన్ ఇందులో తమ్ముడు పాత్రలో కనిపించగా, ప్రముఖ నటి లయ సోదరి పాత్ర పోషిస్తున్నారు. కథలో రాజకీయాలు, బిజినెస్ మాఫియా అంశాలు కీలకంగా ఉంటాయి. కథ నేపథ్యం ఆంధ్రా ప్రాంతంలో చోటుచేసుకుంటుంది.