రవి అన్నకి చిరంజీవి ఎలానో నాకు ఆయన అలా.. త్వరలోనే కారవ్యాన్ లోకి వెళతా, నాని భలే చెప్పాడుగా..

Published : Jul 25, 2022, 06:58 AM IST

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'.జూలై 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రవితేజ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి నేచురల్ స్టార్ నాని అతిథిగా హాజరు కావడం విశేషం.

PREV
16
రవి అన్నకి చిరంజీవి ఎలానో నాకు ఆయన అలా.. త్వరలోనే కారవ్యాన్ లోకి వెళతా, నాని భలే చెప్పాడుగా..

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లో రవితేజ, ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ ఫై బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

26

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రవితేజ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి నేచురల్ స్టార్ నాని అతిథిగా హాజరు కావడం విశేషం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని సింపుల్ స్పీచ్ భలే ఆకట్టుకుంది. రవితేజని చిరంజీవితో పోల్చుతూ నాని ప్రశంసల వర్షం కురిపించాడు. 

36

నాని మాట్లాడుతూ.. నన్ను గెస్ట్ గా పిలిచారని నేను రాలేదు. రవి అన్న గురించి మాట్లాడే ఛాన్స్ వచ్చింది అని వచ్చాను. రవి అన్నకి చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ప్రతి జనరేషన్ కి ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. రవి అన్న చిరరంజీవి గారిని ఎలా ఆదర్శంగా తీసుకున్నారో.. నానా కెరీర్ బిగినింగ్ లో ఆయన్ని నేను అలా ఆదర్శంగా తీసుకున్నాను. మేమంతా హీరోలం అయ్యాం కదా మీరు ఎందుకు కాలేరు అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి రవితేజ. 

46

చిరంజీవిగారి కారవ్యాన్ లోకి రవి అన్న వెళ్లడం చూశాను. త్వరలోనే నేను మీ కారవ్యాన్ లోకి రావాలనుకుంటున్నా అంటూ మల్టీస్టారర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా ప్రతి చిత్రానికి రవి అన్న ఫోన్ చేసి అభినందిస్తారు అని నాని తెలిపారు. 

56

ఇక రామారావు ఆన్ డ్యూటీ చిత్రంపై ఫస్ట్ నుంచే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. షూటింగ్ జరిగితే కానీ పూట గడవని ఫ్యామిలీస్ కోసం రవి అన్న తన కేరీర్ మొత్తం 20 ఏళ్ల నుంచి ఎంత చేస్తున్నారో నాకు తెలుసు. 20 ఏళ్ల నుంచి రవితేజ ఆన్ డ్యూటీ.. ఈ నెల 29 నుంచి రామారావు ఆన్ డ్యూటీ అని అభిమానులని ఉత్సాహ పరిచాడు నాని. 

66

అలాగే ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న హీరో వేణు గురించి కూడా నాని మాట్లాడారు. హనుమాన్ జంక్షన్ చిత్రంలో ఎల్బీ శ్రీరామ్ తో వచ్చే ఆవు ఎపిసోడ్ అంటే తనకు చాలా ఇష్టం అని నాని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా నాని ప్రస్తుతం 'దసరా' అనే మాస్ మూవీలో నటిస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ నిర్మించిన ఎస్ ఎల్వీ సినిమాస్ నిర్మాతలే దసరా చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. 

click me!

Recommended Stories