చిరంజీవి సినిమాతో పోటీపడటానికి స్టార్ హీరోలు ఎవరైనా కాస్త వెనకడుగు వేస్తారు. అటువంటిది మెగాస్టార్ సినిమాకు పోటీగా వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆర్ నారాయణమూర్తి. ఇంతకీ చిరంజీవిని దెబ్బకొట్టిన సినిమా ఏదో తెలుసా?
90స్ లో చిరంజీవి హవా బాగా నడిచింది. నెంబర్ వన్ హీరోగా చిరంజీవి టాలీవుడ్ ను ఏలాడు.. ఏసినిమా చేసినా. అది బాక్సాఫీస్ దగ్గర బ్లాస్ట్ అయ్యేది. ఆయన సినిమాలకు దరిదాపుల్లో కూడా వేరే సినిమా రిలీజ్ చేయడానికి ఏ హీరో సాహసం చేసేవాడు కాదు. చిరంజీవి జోరు అంతలా కొనసాగింది అప్పట్లో. ఎటువంటి సినిమా గ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి.. డాన్స్, యాక్షన్ సీన్స్ తో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈక్రమంలో చిరంజీవి దూకుడుకి బ్రేక్ వేస్తూ.. ఓ సినిమా రిలీజ్ అయ్యింది. అదేదో స్టార్ హీరో సినిమా మాత్రం కాదు.. విప్లవ సినిమాల బ్రాండ్.. ఆర్ నారాయణ మూర్తి సినిమా మెగాస్టార్ సినిమాతో పోటీ పడి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు.. మెగా మూవీని గట్టి దెబ్బ కొట్టింది.
25
చిరంజీవికి పోటీ ఇచ్చిన ఆర్ నారాయణ మూర్తి
1995లో విడుదలైన రెండు తెలుగు సినిమాల మధ్య వచిత్రమైన పోటీ నెలకొంది.. టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే ఓ విచిత్రమైన గెలుపు అందరిని ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రిక్షావోడు సినిమా భారీ అంచనాల మధ్య 1995 డిసెంబర్ 14న రిలీజ్ అయ్యింది. అయితే ఈసినిమాకు ముందే దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆర్. నారాయణ మూర్తిని హీరోగా రూపొందించిన ఒరేయ్ రిక్షా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల పేర్లలోనూ ‘రిక్షా’ అన్న పదం ఉండటం, అలాగే నెల రోజుల లోపే ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం మరో విశేషం.
35
చిరంజీవి కి నారాయణమూర్తి షాక్
ఆ రోజుల్లో టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న చిరంజీవి సినిమా కావడంతో.. రిక్షావోడు పెద్ద సెన్సేషన్‌గా మారుతుందని అందరు అనుకున్నారు. అప్పటికే రిలీజ్ అయ్యి మంచి టాక్ తో నడుస్తున్న ఓరేయ్ రిక్షా కలెక్షన్లు పడిపోతాయి అని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సమాజంలో సమస్యలను వెండితెరపై చూపిస్తూ.. ఆడియన్స్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఆర్. నారాయణ మూర్తి. కానీ ఆయన సినిమాలు కమర్షియల్ గా ఉండవు, కమర్షియల్ సినిమాలకు పోటీ ఇవ్వలేవు. కానీ అప్పుడు మాత్రం ఒరేయ్ రిక్షా మాస్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సాధించింది. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం, పాటలు జనాల్లో దూసుకుపోయాయి. అంతే కాదు ఈసినిమాలో నారాయణమూర్తితో కలిసి రవళి హీరోయిన్‌గా నటించడం కూడా సినిమాకు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంచనాలకు విరుద్ధంగా చిరంజీవి నటించిన రిక్షావోడు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడం, ఆర్. నారాయణ మూర్తి నటించిన ఒరేయ్ రిక్షా మాత్రం సూపర్ హిట్‌గా నిలవడం అందరిని షాక్ కు గురిచేసింది. మెగాస్టార్ ఇమేజ్ ముందు నారాయణ మూర్తి సినిమా నిలబడదేమో అనకున్నారు అంతా. కానీ ఆ నారాయణమూర్తి చిరంజీవి సినిమాను కోలుకోలేని దెబ్బ తీశాడు.
55
చిరంజీవి సినిమాల్లో నారాయణ మూర్తి.
ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఇందుకు ముందు చిరంజీవి నటించిన కోతల రాయుడు, ప్రాణం ఖరీదు వంటి సినిమాల్లో ఆర్. నారాయణ మూర్తి కూడా నటించారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఇద్దరు నటులు మంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నారు . ఈ నేపథ్యంతో 1995లో చోటుచేసుకున్న ఈ బాక్సాఫీస్ పొటీ అప్పట్లో టాలీవుడ్ వర్గాల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది.