కొన్ని నెలల తర్వాత నిషేధం ఎత్తివేయబడినప్పటికీ, అప్పటికి నికితా తుక్రాల్ దర్శకుల దృష్టిలో వివాదాస్పద నటిగా ముద్ర పడిపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు రాలేదు. సినిమా రంగానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తరువాత, నటి 2017 లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుంది. సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరమైన నికిత.. ఇప్పుడు ఓ కూతురికి తల్లి అయి కుటుంబంతో హ్యాపీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో మాత్రం ఆమె సందడి చేస్తూనే ఉంది.