ఒక్క దెబ్బతో ఇమాన్వి లైఫ్‌ టర్న్.. ఒక్క రోజులోనే లక్షల్లో పెరిగిన ప్రభాస్‌ హీరోయిన్‌ ఫాలోవర్స్..

First Published | Aug 17, 2024, 6:32 PM IST

ప్రభాస్‌, హను రాఘవపూడి సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఇందులో హీరోయిన్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ వైరల్‌ అవుతుంది. 
 

ప్రభాస్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శనివారం గ్రాండ్‌గా లాంఛ్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ కూడా పాల్గొన్నారు. 
 

ప్రస్తుతం ప్రభాస్‌, హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో హీరోయిన్‌ కూడా ఉండటం విశేషం. ఆమె పేరు ఇమాన్వి. అసలు పేరు ఇమాన్‌ ఇస్మాయిల్‌. తాజాగా టీమ్‌ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో హీరోయిన్‌ గురించి వెల్లడించింది టీమ్‌. అయితే ఈ కొత్త హీరోయిన్‌ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆమె గురించి వెతకడం ప్రారంభించారు. ఈక్రమంలో ఇమాన్వి సోషల్‌ మీడియా అకౌంట్లు వైరల్‌ అవుతున్నాయి. 
 


అంతేకాదు ప్రభాస్‌ ఫ్యాన్స్ దెబ్బకి ఇమాన్వికి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ లక్షల్లో పెరిగిపోతున్నారు. ప్రభాస్‌ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ప్రకటించడానికి ముందు ఐదు లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఏడు లక్షలు దాటేశారు. ఒక్క రోజుల్లోనే రెండు లక్షల  ఫాలోవర్స్ యాడ్‌ కావడం విశేషం. 

అంతేకాదు ఇమాన్వి గురించి విషయాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆడిషన్‌ ద్వారా ఇమాన్విని ఎంపిక చేశాడట దర్శకుడు హనురాఘవపూడి. ఇమాన్వి సోషల్‌ మీడియాలో క్రేజ్‌ ఉన్న అమ్మాయి మాత్రమే కాదు నటి, డాన్సర్‌, కొరియోగ్రాఫర్‌ కావడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కొన్ని డాన్స్ వీడియోలు పంచుకుంది. 
 

ఇందులో ఆమె డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే. క్లాసిక్‌, వెస్ట్రన్‌ మిక్స్ చేసి ఆమె చేసే డాన్సులు అదిరిపోయేలా ఉన్నాయి. తొలి చిత్రంతోనే ఆమె పాన్‌ ఇండియా మూవీ చేసే అవకాశం రావడం, పైగా ప్రభాస్‌ వంటి గ్లోబల్‌ స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదు. దెబ్బకి ఇప్పుడు ఇండియన్‌ సెన్సేషన్‌గా మారింది ఇమాన్వి. 
 

ఇదిలా ఉంటే ఈ సినిమా 1940 వార్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఇప్పటి వరకు బయటకు రాని, చరిత్ర దాచబడిన ఒక యోధుడి కథని చెప్పబోతున్నారట దర్శకుడు హను రాఘవపూడి. ఇందులో మిథున్‌ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారు. 

Latest Videos

click me!