నిధి అగర్వాల్ ప్రస్తుతం `హరిహర వీరమల్లు`, `ది రాజా సాబ్` చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా `హరిహర వీరమల్లు` రూపొందుతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం విజయవాడలో జరుగుతుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌కి దగ్గర్లోనే ఓ సెట్ వేశారట. అందులోనే ఈ మూవీని షూట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ పాల్గొంటుంది. మార్నింగ్ ఆరు గంటల నుంచి 12 గంటల వరకు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటుందట నిధి అగర్వాల్.