టాలీవుడ్‌లో మాస్ హీరోగా పేరున్న బాలకృష్ణ `అఖండ`, `వీర సింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, `డాకు మహారాజ్` వంటి సినిమాలతో తన సత్తా చాటారు. ఇప్పుడు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో `అఖండ 2`లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. శివ తత్వం, ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇది `అఖండ` కంటే మంచి సినిమా అవుతుందని, బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.
Also Read: రామ్ చరణ్ సినిమాకు చిరంజీవి రిపేర్లు