టాలీవుడ్‌లో మాస్ కి పెట్టింది పేరు బాలకృష్ణ. `అఖండ`, `వీర సింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, `డాకు మహారాజ్` వంటి సినిమాలతో తన సత్తా చాటారు. ఇప్పుడు మాస్ సినిమాల మోగుడు బోయపాటి శ్రీను `అఖండ 2`లో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. శివ తత్వం, ప్రకృతిని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నారట. ఇది `అఖండ` కంటే మెరుగ్గా ఉంటుందని, బాలయ్య కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.