నిధి అగర్వాల్ లీక్డ్ ఫోటో హల్ చల్.. యంగ్ బ్యూటీకి ఫుల్ పబ్లిసిటీ, ఏమని క్లారిటీ ఇచ్చిందంటే 

First Published | Dec 20, 2024, 11:02 AM IST

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఎందుకంటే నిధి అగర్వాల్ చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అదే విధంగా ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఎందుకంటే నిధి అగర్వాల్ చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అదే విధంగా ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో కూడా నటిస్తోంది. హరి హర వీరమల్లు లో ఆమె ఓన్లీ హీరోయిన్. కానీ రాజా సాబ్ లో నిధి అగర్వాల్ తో పాటు మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కూడా నటిస్తున్నారు. 

రాజా సాబ్ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజా సాబ్ నుంచి త్వరలో టీజర్ రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. స్టార్ హీరోల సినిమాలని లీకులు వేధిస్తుంటాయి. 


రీసెంట్ గా రాజా సాబ్ చిత్రం నుంచి నిధి అగర్వాల్ స్టిల్ ఒకటి లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. నిధి అగర్వాల్ ఈ ఫొటోలో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొడుతోంది. లాంగ్ స్కర్ట్ ధరించిన నిధి అగర్వాల్ స్టైలిష్ గా ఉంది. ఇది రాజా సాబ్ చిత్రంలోని లుక్ అంటూ ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు. ఇంత అందమైన లుక్ ఎలా లీక్ అయింది అంటూ అంతా షాక్ అయ్యారు. 

ఒక్కసారిగా నిధి అగర్వాల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనితో నిధి అగర్వాల్ స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతా అనుకుంటున్నట్లు అది రాజా సాబ్ చిత్రంలోని స్టీల్ కాదని నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. ఒక యాడ్ షూట్ లోని స్టీల్ అని తెలిపింది. ఏది ఏమైనా ఈ ఫోటో వ్యవహారంతో నిధి అగర్వాల్ కి ఫుల్ పబ్లిసిటీ లభించింది. 

Also Read : రంగస్థలం బ్యూటీతో రొమాన్స్, బుర్ర తక్కువ పనితో రూ. 2 కోట్లు పోగొట్టుకున్న గౌతమ్.. మొత్తం అప్పు చేసిన డబ్బే

Latest Videos

click me!