రాజమౌళి - మహేష్ బాబు సినిమాపై కాయ్ రాజ కాయ్.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది...?

First Published | Dec 20, 2024, 9:54 AM IST

రాజమౌళి - మహేష్ బాబు సినిమా ఇంకా ఓపెనింగే కాలేదు.. అప్పుడు కలెక్షన్ల వరకూ వెళ్లిపోతున్నాడు ఆడియన్స్. ఈసినిమా పై ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా..? 
 

Rajamouli, mahesh babu,AI

ఇగో స్టార్ట్ చేస్తాం..అగో స్టార్ట్ చేస్తాం అంటున్నారు కాని.. రాజమౌళి - మహేష్ బాబు  సినిమా మాత్రం ఇంకా స్ట్రాట్ అవ్వడంలేదు. ఇక ఫైనల్ గా వచ్చే ఏడాది జనవరిలో .. అంటే నెక్ట్స్ మన్త్ లోనే  ఈసినిమా ఓపెనింగ్ జరగబోతుంది అంటూ గట్టిగా టాక్ అయితే వినిపిస్తుంది.

అందులో నిజం ఎంత.. అబడ్డం ఎంతా అనేది అది జరగే వరకూ డౌటే. కాని మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం బాగా డిస్పపాయింట్ తో ఉన్నారు. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు అంటు.. తెగ విసుక్కుంటున్నారు. 
 

అయితే ఇక్కడ మరోవిషయం ఏంటంటే.. జక్కన్న తీయబోయేది పాన్ వరల్డ్ మూవీ.. దాదాపు 1200 కోట్ల బడ్జెట్. .మరి అలాంటి సినిమా మన ఇండియాలో ఎవరూ తీయ్యలేదు.. అది కూడా మన తెలుగు దర్శకుడు స్టార్ట్ చేస్తున్నాడు.. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి.. ప్రతీ అడుగు ఆచితూచి వేయాలి. సో ఇప్పటి వరకూ మహేష్ లుక్స్ గురించే చాలా చేంజస్ జరిగినట్టు టాక్. ఇక ఈమధ్యే సూపర్ స్టార్ పైనల్ లుక్ బయటకు వచ్చింద. 


సో ఇక బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయింది..దాదాపు రెండేళ్లకు పైగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వడానికి టైమ్ పట్టిందట. ఇక సినిమా స్టార్ట్ చేయడమే తరువాయి. అయితే ఇక్కడే ఈసినిమా పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

వెనకట ఓ సామెత ఉంది కదా.. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు అదేదో అన్నట్టు.. రాజమౌళి - మహేష్ బాబు సినిమా స్టార్ట్ అవ్వనే లేదు. కాని ఈ సినిమా అన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తుంది.. ఇన్ని రికార్డ్ లు బ్రేక్ చేస్తుంది అని ఆడియన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. 
 

Rajamouli, Mahesh babu,varanasi

అంతే కాదు మనోడి సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది చూడు.. కావాలంటే బెట్టా అంటున్నారట ఫ్యాన్స్ సరదాగా. అంతే కాదు రాజమౌళి - మహేష్ బాబు  సినిమా ఫస్ట్ డే ఎంత వసూలు చేయవచ్చు.. ఓవర్ ఆల్ గా పైనల్ రన్ లో ఎంత వసూలు చేస్తుంది అంటూ లెక్కల మీద లెక్కలు వేసేస్తున్నారట. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప2 సినిమా మొదటి రోజే 300 కోట్లకుపైగా వసూలు చేసింది కదా.. 

ఇక మహేష్ బాబు సినిమా అంతకు మించి ఉంటుంది. పాన్ వరల్డ్ కాబట్టి.. తక్కువలో తక్కువ 500 కోట్లు అయినా వసూలు చేయకుండా ఉంటుందా అని అనుకుంటున్నారట అభిమానులు అంతేకాదు ఈసినిమాకు సోషల్ మీడియా లెక్కల ప్రకారం 1200 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు కదా..  ఓవర్ ఆల్ గా ఈమూవీ ఫైనల్ రన్ లో 3000  కోట్లన్నా రాబట్టకుండా ఉంటుందా అని కూర్చుని హ్యాపీగా లెక్కలేసుకుంటున్నారట. మరికొంత మంది అంత లేదు అంటుంటే.. ఇంకొంత మంది మాత్రం అంతకు మించి ఉంటుంది అటున్నారట. 

మొదటి రోజు 500 కోట్లేంటి.. ఇంకా ఎక్కువే వస్తాయి అంటున్నారట అభిమానులు. సరదాగా బెట్ కూడా ముందే కట్టేసుకుంటున్నారట. కావాలంటే నాపందె ఇంతా.. వడ్డీతో సహా ఇచ్చేయ్ రోయ్.. అంటూ ఫ్రెండ్స్ మధ్య సరదా బెట్టింగ్ లు నడుస్తున్నాయట.

మరి ఆడియన్స్ లో అభిమానుల్లో చర్చ జరుగుతున్నట్టుగా రాజమౌళి - మహేష్ బాబు సినిమా ఎన్ని రికార్డ్స్ తిరగరాస్తుంది..? ఎంత వసూలు చేస్తుంది చూడాలి మరి. ఈసినిమాలో హీరోయిన్ ఎవరు..? కాస్ట్ సంగతేంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎలాగూ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ఫిక్స్ అనే చెప్పాలి. ఆస్కార్ తెచ్చిన ఘనుడు కాబట్టి.. ఈ సినిమాకు అంతకు మించి ఇస్తాడని చూస్తున్నారు ఫ్యాన్స్. 

Latest Videos

click me!