నెట్‌ ఫ్టిక్స్ లో టాప్‌ 5 మూవీస్‌.. ఒక్క రోజులోనే ఓటీటీని షేకింగ్‌ చేస్తోన్న పవన్‌ కళ్యాణ్‌

Published : Oct 24, 2025, 07:16 PM IST

Netflix Top 5 Trending: ఓటీటీలో మాధ్యమంలో నెట్‌ ఫ్లిక్స్ కీలకమని చెప్పొచ్చు. పెద్ద పెద్ద సినిమాలు ఇందులో విడుదలవుతాయి. అయితే తాజాగా ఓటీటీలో టాప్‌ 5లో ట్రెండ్ అవుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 

PREV
16
నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 5 ట్రెండింగ్స్

ఇప్పుడు థియేటర్లలో కంటే ఓటీటీలో ఏ మూవీ బాగా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. జనాలు కూడా ఓటీటీల వైపే మొగ్గుచూపుతున్నారు. ఓటీటీలో థియేటర్లకి మించిన కంటెంట్‌ ఉంటుంది. డిఫరెంట్‌ జోనర్ మూవీస్, వెబ్‌ సిరీస్‌ ఉంటున్నాయి. కామెడీ సినిమాలు, థ్రిల్లర్స్, యాక్షన్‌, లవ్‌ స్టోరీస్‌, ఫిక్షన్‌ ఇలా అన్ని రకాల మూవీస్, సిరీస్ లు లభిస్తున్నాయి. వీటితోపాటు తెలుగు సినిమాలే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌, అంతర్జాతీయ సినిమాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో తమకు నచ్చిన చిత్రాలను చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలకు, సిరీస్‌లకు థియేటర్లలో కంటే ఓటీటీలోనే కంపీటిషన్‌ ఎక్కువైపోయింది. అయితే తాజాగా నెట్‌ ఫ్లిక్స్ లో ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్న సినిమాలేంటి? టాప్  5లో ఉన్న మూవీస్‌ ఏంటనేది చూస్తే. పవన్‌ షేక్ చేస్తున్నాడని చెప్పొచ్చు.  

26
నెట్‌ ఫ్లిక్స్ లో నెంబర్‌ 1లో `ఓజీ` ట్రెండింగ్‌

పవన్‌ కళ్యాణ్‌ లేటెస్ట్ గా `ఓజీ` మూవీలో నటించారు. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ మూవీ ఈ నెల 23న నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇది ఒక్క రోజులోనే టాప్‌లోకి వచ్చింది. నెంబర్‌ 1 స్థానంలో  స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. అదే సమయంలో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇది పవన్‌ రేంజ్‌ని చాటి చెబుతుందని చెప్పొచ్చు. ఇది పూర్తి మాస్‌, యాక్షన్‌ మూవీ. అయినా ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగా చూస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ప్రకాష్‌ రాజ్‌, ఇమ్రాన్‌ హష్మీ, శ్రియారెడ్డి, హరీష్‌ ఉత్తమన్‌, తేజ్‌ సప్రూ, శుభలేఖ సుధాకర్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న థియేటర్లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి తెలుగులో ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది.

36
నెట్‌ ఫ్లిక్స్ లో టాప్‌ 2లో `ది బ్యాడ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌` ట్రెండింగ్‌

నెట్‌ ఫ్లిక్స్ లో రెండో స్థానంలో ట్రెండ్‌ అవుతున్నది `ది బ్యాడ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌`. ఇది బాలీవుడ్‌ ఇండస్ట్రీలోని తెరవెనుక విషయాలను ఆవిష్కరించే వెబ్‌ సిరీస్‌. ఇందులో బాలీవుడ్‌ స్టార్స్ మొత్తం కనిపించారు. వాహ్‌ అనిపించారు. మరోవైపు బాలీవుడ్ కి సంబంధించిన గ్రేషేడ్‌ అంశాలను కూడా ఆవిష్కరించిన సిరీస్‌ కావడంతో ఇది గత రెండు వారాలుగా ట్రెండ్‌ అవుతోంది. దీన్ని నార్త్ ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. దీంతో ఇప్పుడు నెట్‌ ఫ్లిక్స్ లోనే రెండో స్థానంలో ట్రెండ్‌ అవుతుంది.

46
టాప్‌ 3లో `మహవతార్‌ నరసింహ` ట్రెండింగ్‌

మరోవైపు మూడో స్థానంలో `మహావతార్‌ నరసింహ` మూవీ ట్రెండ్‌ అవుతుంది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి చాలా రోజులే అవుతుంది. అయినా టాప్‌లో ఉండటం విశేషం. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ బాగా చూశారు. ఇది కూడా రూ.326కోట్లు రాబట్టింది. కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఈ రేంజ్‌లో వసూళ్లని రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. విష్ణువు అవతారమైన నరసింహ అవతారం ప్రధానంగా చేసుకుని భక్త ప్రహ్లాద కథతో యానిమేషన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించారు.

56
టాప్‌ 4లో ట్రెండ్‌ అవుతున్న ఎన్టీఆర్‌ `వార్‌ 2`

నెట్‌ ఫ్లిక్స్ లో నాల్గో స్థానంలో ఎన్టీఆర్‌ మూవీ ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్‌ హీరోగా `వార్‌ 2` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ మూవీలో హృతిక్‌ రోషన్‌ మరో హీరోగా నటించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్ట్ 14న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ మాత్రం ఓటీటీలో మంచి వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీని తెగ చూస్తున్నారు. గత నాలుగు వారాలుగా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

66
నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 5లో మరో యానిమేషన్‌ మూవీ `కురుక్షేత్ర` ట్రెండింగ్‌

దీంతోపాటు ఈ వారమే విడుదలైన మైథలాజికల్‌ యానిమేషన్‌ సిరీస్‌ `కురుక్షేత్రః పార్ట్ 2` కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇది టాప్‌ 5లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ పర్వాన్ని ప్రధానంగా చేసుకుని ఈ సిరీస్ ని రూపొందించారు. దీన్ని కూడా ఓటీటీ ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. ఇలా `ఓజీ`, `ది బ్యాడ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌`, `మహావతార్‌ః నరసింహ`, `వార్‌ 2`, `కురుక్షేత్ర` చిత్రాలు, సిరీస్‌లు నెట్‌ ఫ్లిక్స్ లో టాప్‌ 5లో ట్రెండ్ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories