నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లతో ఇంతవరకు ఎందుకు నటించలేదు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి అనేక అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తరంలో మాత్రం మల్టీస్టారర్ చిత్రాలు రాలేదు.
25
ఆ నలుగురు కలిసి నటించింది లేదు
ఈ నలుగురు హీరోలు కలిసి నటించాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కనీసం ఇద్దరైనా మల్టీస్టారర్ మూవీ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే బాలయ్య, చిరంజీవి ఒకే వేదికపై కనిపించినప్పుడు.. ఇద్దరూ కూడా మల్టీస్టారర్ చిత్రానికి సై అనడం, ఫ్యాన్స్ ని ఖుషీ చేయడం జరుగుతోంది తప్ప ఆ దిశగా అడుగులు పడడం లేదు.
35
ఇగో సమస్య కాదు
అయితే బాలయ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ చిత్రాల గురించి చెప్పారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో మీరు ఇంతవరకు కలిసి నటించలేదు. ఒకే తరానికి చెందిన మీరు ఎందుకు మల్టీస్టారర్స్ చేయడం లేదు.. ఇగో సమస్య ఉందా ? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి బాలయ్య సమాధానం ఇస్తూ.. మా మధ్య ఇగో లేదు. మల్టీస్టారర్ సినిమాల గురించి చెప్పాలంటే.. నాన్నగారు, ఏఎన్నార్ గారు చాలా చిత్రాలు చేశారు. వాళ్లిద్దరూ సూపర్ స్టార్లు అయినప్పటికీ కొన్ని చెత్త సినిమాలు కూడా చేశారు.
ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తుంటే ఆ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ కావాలనేది నా అభిప్రాయం అని బాలయ్య అన్నారు. మల్టీ స్టారర్ మూవీ అంటే ఫ్యామిలీ డ్రామా, మాస్, యాక్షన్, కామెడీ కోరుకునే అందరు ప్రేక్షకులని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి. అప్పుడే నేను మల్టీస్టారర్ చిత్రానికి ఒప్పుకుంటాను అని బాలయ్య అన్నారు.
55
అఖండ 2తో రాబోతున్న బాలయ్య
మైథలాజికల్ కథలతో మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి. కానీ వేరే హీరోలు అంగీకరించలేదు అని బాలయ్య అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 లో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.