అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్ ఖర్చు ఎంతంటే.? నీరజ కోన ఏం చెప్పారంటే.?

Published : Oct 24, 2025, 06:29 PM IST

Neeraja Kona: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, దర్శకురాలు నీరజ కోన తన కెరీర్ అనుభవాలను ఇటీవల యూట్యూబ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. స్టార్ హీరోల లుక్స్ విషయంలో పలు కీలక కామెంట్స్ చేసింది. మరి ఆ వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. 

PREV
15
కాస్ట్యూమ్ డిజైనింగ్ అనుభవాలపై కీలక కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తన కెరీర్, చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనింగ్ అనుభవాలు, స్టార్ హీరోల వ్యవహార శైలిపై తన అభిప్రాయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమెకు బాల్యం నుంచి పుస్తకాలు రాయడం, చదవడం అలవాటు ఉందట. అలాగే రచనా నైపుణ్యం కూడా ఉంది. చిన్నప్పటి నుండి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండటంతో, అమెరికాలో ఫ్యాషన్ మార్కెటింగ్, విజువల్ మర్చెండైజింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. లూయిస్ విట్టన్, జె. లిండెబెర్గ్ వంటి బ్రాండ్‌లతో ఇంటర్న్‌షిప్‌లు చేసి, మైఖేల్ కోర్స్ కోసం మూడు సంవత్సరాలు పనిచేశారు.

25
అమెరికా నుండి ఇండియాకు..

అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత, ఫ్యాషన్ సంబంధిత ఉద్యోగాలు ముంబైలో ఎక్కువగా ఉండటం.. కుటుంబంతో ఉండాలనే ఆకాంక్షతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టానని నీరజ కోన పేర్కొన్నారు. తన సోదరుడు కోన వెంకట్ సూచన మేరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనింగ్ ప్రయత్నించారు. మొదట ఆమెకు స్కెచింగ్ రాకపోయినా, మార్కెటింగ్ వ్యక్తిగా తన ఆలోచనలను స్పష్టంగా తెలియజేయగల సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు నీరజ కోన.

35
100కు పైగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా

దైవానుగ్రహం వల్ల తన కెరీర్ స్టార్టింగ్ లోనే గుండెజారి గల్లంతయ్యిందే, అత్తారింటికి దారేది, ఎవడు, వన్, బాద్ షా, హార్ట్ ఎటాక్, గోవిందుడు అందరి వాడేలే, రామయ్య వస్తావయ్యా వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, హరీష్ శంకర్ వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశారు. ఇప్పటివరకు 100కు పైగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు.

45
స్టార్ హీరోల కాస్ట్యూమ్స్‌పై కామెంట్స్..

కాస్ట్యూమ్ డిజైనింగ్‌పై తన ఆసక్తి కాలక్రమేణా పెరిగిందని, దీనిపై మొదటి నుండి ప్యాషన్ లేదని, పనిలో చేరిన తర్వాతే నేర్చుకుంటూ పర్ఫెక్షనిస్ట్ అయ్యానని నీరజ కోన తెలిపారు. నటుల స్టైల్ గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు కాన్ఫిడెంట్ స్టైల్ ఉందని, ఏ దుస్తులు వేసుకున్నా వాటిలో అలవోకగా సెట్ అవ్వగలరని అన్నారు. రామ్ చరణ్ స్టైల్ కూడా చాలా సులువుగా ఉంటుందని చెప్పారు. నాని గురించి మాట్లాడుతూ, ఆయనకు క్యాజువల్, ఎఫర్ట్‌లెస్ స్టైల్ ఉంటుందని, ఏది వేసుకున్నా బాగుంటారని, సహజంగా ఉంటారని వివరించారు. బ్రాండెడ్ దుస్తులు మాత్రమే ధరించాలని నటులు కోరుకోరని, వారికి సౌకర్యం ముఖ్యమని అన్నారు. ఒక సినిమాకు కాస్ట్యూమ్స్ బడ్జెట్ కోట్లలో ఉండదని, అది నటులు, వారి ప్రాధాన్యతలు, దుస్తుల ఫిట్టింగ్‌పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

55
సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక దుస్తులను..

సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఆ దుస్తులను కొందరి నటులు జ్ఞాపకంగా తీసుకెళ్తారని, అయితే చాలావరకు ప్రొడక్షన్ హౌస్‌లలోనే ఉంటాయని తెలిపారు. అవి వాష్ చేసి, డ్రై క్లీన్ చేసి, తదుపరి సినిమాల్లో రీసైకిల్ చేస్తారని, కొన్నిసార్లు బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లకు కూడా ఉపయోగిస్తారని వివరించారు. ఇంద్ర సినిమా షర్ట్‌ల వేలం పాట వంటివి అభిమానుల కోసం చేసేవి అని, కానీ సాధారణంగా దుస్తులను ప్రొడక్షన్ హౌస్‌లు జాగ్రత్తగా నిర్వహిస్తాయని ఆమె తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories