OTT: నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత కాస్ట్లీ వెబ్ సిరీస్ ఇది. ఇప్పటికే నాలుగు సీజన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు ఐదో సీజన్‌పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ సిరీస్ ఏంటి.? బడ్జెట్ ఎంత.? ఇప్పుడు చూసేద్దాం.
క్రైమ్ నుంచి హారర్ వరకు.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్‌కు నెట్‌ఫ్లిక్స్ నిలయం. ఇది ఒక ప్రత్యేకమైన వెబ్ సిరీస్. ఇప్పటికే నాలుగు సీజన్లు విడుదలయ్యాయి. అవన్నీ కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక ఐదో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సిరీస్ మరేదో కాదు స్ట్రేంజర్ థింగ్స్. దాదాపుగా ఈ వెబ్ సిరీస్‌ను రూ. 450-500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
25
సీజన్-5 ఆన్ కార్డ్స్
2016లో ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్.. ఇప్పటికీ 9 ఏళ్లు పూర్తైన ట్రెండింగ్‌లోనే ఉంది. నెట్ ఫ్లిక్స్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ సీజన్-5 రూపొందుతోంది. ఈ సీజన్ ప్రతీ ఎపిసోడ్ రూ. 4.5-5.5 కోట్లు ఖర్చు అవుతోందని సమాచారం. అంటే.. టీవీ షోల కంటే.. ఈ బడ్జెట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ధీటైనది. ఈ సిరీస్ ప్రధానంగా విజువల్స్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉంది. 1980 నాటి సెట్స్, అలాగే సిరీస్‌లో వెంటాడే అప్‌సైడ్ డౌన్ విలన్‌కు ఖర్చు ఎక్కువే అవుతుంది. స్ట్రేంజర్ థింగ్స్- సీజన్ 5లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి.
35
భారీ బడ్జెట్.. భారీ రన్ టైం
ప్రతి ఎపిసోడ్ 90 నుంచి 120 నిమిషాల మధ్య ఉంటుంది. అంటే ఐదవ సీజన్ మొత్తం 11 గంటలకు పైగా రన్‌టైమ్ కలిగి ఉంటుందన్న మాట. ఈ సిరీస్‌లో మొదటి నాలుగు ఎపిసోడ్‌లు నవంబర్ 26న విడుదల కాగా.. తదుపరి మూడు ఎపిసోడ్‌లు డిసెంబర్ 25న ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వస్తాయి.
ఇక చివరి క్లైమాక్స్ ఎపిసోడ్ డిసెంబర్ 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అంటే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు.. స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు పెద్ద సినిమాటిక్ ట్రీట్ అని చెప్పొచ్చు. ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ ఐదో సీజన్ కూడా సూపర్ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
55
మిల్లీ బాబీ బ్రౌన్ ప్రధాన పాత్రలో..
ఇక తారాగణం విషయానికొస్తే.. చివరి సీజన్‌లో మిల్లీ బాబీ బ్రౌన్, ఫిన్ వోల్ఫ్‌హార్డ్, గేటెన్ మాతరాజో, కాలేబ్ మెక్‌లాఫ్లిన్, నోహ్ ష్నాప్, వినోనా రైడర్, డేవిడ్ హార్బర్, సాడీ సింక్, జామీ కాంప్‌బెల్ బోవర్, నటాలియా డయ్యర్, చార్లీ హీటన్, జో కీరీ, మాయా హాక్ వంటి వారు ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు.