అల్లు అర్జున్, నాని, నాగవంశీ లతో మీట్ అయిన నెట్ ఫ్లిక్స్ సీసీవో.. బాంబు లాంటి ధరకు డీల్ క్లోజ్ ?

Published : Sep 17, 2025, 06:00 PM IST

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఏఏ22xఏ6 చిత్ర యూనిట్ తో నెట్ ఫ్లిక్స్ సంస్థ చర్చలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్, నాని లాంటి స్టార్ హీరోలతో నెట్ ఫ్లిక్స్ సీసీవో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. 

PREV
15
ఫస్ట్ టైం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ 

భారత సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాలలో ఒకటైన ఏఏ22xఏ6 ప్రాజెక్ట్ అధికారికంగా ముందుకు సాగుతోంది. ఈ చిత్రంలో తొలిసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కలసి పనిచేస్తుండటం ప్రత్యేకత. ఈ గ్రాండ్ సినిమాకు బ్యూటీ క్వీన్ దీపికా పడుకొనే కథానాయికగా నటిస్తున్నారు.

25
త్వరలో అబుదాబిలో షెడ్యూల్ 

తాజాగా ముంబై షెడ్యూల్ పూర్తయింది. అందులో ఒక ఎనర్జిటిక్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఇకపై వచ్చే అక్టోబర్‌లో అబుదాబిలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రత్యేకంగా లివా డెజర్ట్ ప్రాంతాన్ని స్కౌటింగ్ చేసి, అద్భుతమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించడానికి సిద్ధమయ్యారు.

35
అల్లు అర్జున్, అట్లీ మూవీ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ చేతికి ?

ఇకపోతే, ఈ ప్రాజెక్ట్‌పై నెట్‌ఫ్లిక్స్ భారీ ఆసక్తి కనబరుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ క్రియేటివ్ కంటెంట్ ఆఫీసర్(సీసీవో) బెలా బజారియా తన బృందంతో కలిసి అల్లు అర్జున్, అట్లీ, నాని, నిర్మాతలు అల్లు అరవింద్, నాగ వంశిలను కలిసిన విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మీటింగ్ సాధారణం కాదని, ఏఏ22xఏ6 ఓటీటీ హక్కులపై ప్రత్యేక చర్చ జరిగినట్టు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

45
భారీ ధరకి హక్కులు 

సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమాకు హక్కులు పొందడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఖచ్చితమైన ఫిగర్స్ గోప్యంగా ఉంచినప్పటికీ, ఈ డీల్ స్థాయి దాని ప్రాధాన్యతను చాటుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

55
800 కోట్ల బడ్జెట్ 

ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. సంగీతం అందిస్తున్న సాయి అభ్యంకర్ తన ప్రత్యేకమైన బాణీలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కోసం సన్ పిక్చర్స్ సంస్థ ఏకంగా 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు టాక్. భారీ కాస్ట్, క్రూ, అంతర్జాతీయ స్థాయి ప్రొడక్షన్ విలువలతో రూపొందుతున్న ఏఏ22xఏ6 ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశంగా నిలిచే తెలుగు సినిమా ప్రాజెక్ట్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories