Suman Shetty: లైఫ్‌ ఇచ్చిన డైరెక్టర్‌ కోసం సుమన్‌ శెట్టి చేసిన పని తెలిస్తే సలామ్‌ కొట్టాల్సిందే

Published : Sep 17, 2025, 05:50 PM IST

కమెడియన్‌ సుమన్‌ శెట్టి `జయం` చిత్రంతో కమెడియన్‌గా వెండితెరకు పరిచయం అయ్యాడు. తనకు లైఫ్‌ ఇచ్చిన డైరెక్టర్‌ కోసం సుమన్‌ శెట్టి చేసిన పని తెలిస్తే సలామ్‌ కొట్టాల్సిందే. 

PREV
14
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సైలెన్స్ వీడిన సుమన్‌ శెట్టి

కమెడియన్‌ సుమన్‌ శెట్టి ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లో సందడి చేస్తున్నారు. మొదటి వారం కాస్త కామ్‌ గా ఉన్న ఆయన నెమ్మదిగా తన కామెడీ స్టార్ట్ చేశాడు. నామినేషన్‌లో రెచ్చిపోయాడు. ఓ వైపు కౌంటర్లు ఇస్తూనే మరోవైపు కామెడీ చేస్తున్నారు. రెండు మిక్స్ చేసి కొడుతున్నాడు. అయితే మిగిలిన వారిలా ముచ్చట్లకు దూరంగా ఉంటున్నాడు. కెమెరాలో కనిపించాలనే తాపత్రయం కనిపించడం లేదు. టాస్క్ ల్లో మాత్రం బెస్ట్ ఇస్తున్నాడు. తన పనేదో తాను చేసుకుంటున్నారు. ఎక్కువగా ఇతరులతో మింగిల్‌ అయినట్టు కనిపించడం లేదు.

24
సుమన్‌ శెట్టికి ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్‌

అయినా మొదటి వారం నామినేషన్‌లో ఉన్నాడు సుమన్‌ శెట్టి. యాక్టివ్‌గా ఉండటం లేదని హరీష్‌ ఆయన్ని నామినేట్‌ చేశాడు. కానీ సుమన్‌ శెట్టికి విపరీతమైన ఓటింగ్‌ పడింది. ఆ ఓటింగ్‌ చూస్తుంటే సుమన్‌ శెట్టి ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు సుమన్‌ శెట్టి. ఆ తర్వాత కనిపించలేదు. అడపాదడపా సినిమాలు చేసినా అవి ఆడియెన్స్ వరకు వెళ్లలేదు. దీంతో ఆయన విషయంలో గ్యాప్‌ వచ్చింది. దీంతో చాలా రోజుల తర్వాత సుమన్‌ శెట్టి కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఆయన్ని ఆదరిస్తున్నారు. ఆ ఆదరణ ఓటింగ్‌ రూపంలో చూపిస్తున్నారు.

34
లైఫ్‌ ఇచ్చిన దర్శకుడి కోసం సుమన్‌ శెట్టి

ఇదిలా ఉంటే తాజాగా సుమన్‌ శెట్టి గురించి దర్శకుడు తేజ చెప్పిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుమన్‌ శెట్టి గురించి వెల్లడించారు. ఆయన రూపొందించిన `జయం` చిత్రంలో సుమన్‌ శెట్టికి ఆఫర్‌ ఇచ్చారు తేజ. ఆ సినిమా సుమన్‌ శెట్టి లైఫ్‌నే మార్చేసింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. స్టార్‌ కమెడియన్‌ అయ్యాడు. ఇండస్ట్రీని శాసించాడు. ఆర్థికంగానూ బాగా ఎదిగాడు. సొంతంగా ఇళ్లు కట్టుకున్నాడు. అయితే ఓ సందర్భంగా సుమన్‌ శెట్టి కలిసి మీ రుణం ఎలా తీర్చుకోవాలి గురువుగారు అని తేజని అడిగితే, వచ్చిన డబ్బులతో మంచి ల్యాండ్‌ కొనుక్కొని ఇళ్లు కట్టుకో అని చెప్పాడు. చెప్పినట్టుగానే ఇళ్లు కట్టుకున్నాడు సుమన్‌ శెట్టి.

44
తేజకి తన ఇంట్లో రూమ్‌ కట్టించిన సుమన్‌ శెట్టి

ఆ తర్వాత మరోసారి వచ్చి సార్‌ మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడిగితే, ``ఏం వద్దు, ఇప్పుడు తాను కొత్తవాళ్లతో సినిమాలు చేస్తున్నా. ఏదో రోజు అన్ని కోల్పోయి రోడ్డుమీదకు వస్తాను. ఆ టైమ్‌లో నాకు ఉండటానికి ఒక రూమ్‌ ఇవ్వు అన్నాను. నేను చెప్పినట్టుగానే నాకోసం ఒక రూమ్‌ కట్టాడు. అందులో నా ఫోటో పెట్టుకున్నారు. రోజూ దాన్ని క్లీన్‌ చేస్తున్నాడు`` అని తెలిపారు తేజ. సుమన్‌ శెట్టి కృతజ్ఞతాభావాన్ని, గొప్ప మనసుని వెల్లడించారు తేజ. జీ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ ఈ విషయం చెప్పారు. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories