ఎపిసోడ్ ప్రారంభంలో నా కోడలికి నేనే తినిపిస్తాను అంటూ శారదమ్మ అనుకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆర్య కి నీరజ్ భోజనం వడ్డిస్తాడు. ఉప్పు, కారాలు భరించలేక పోతారు కానీ శారదమ్మ బాధపడుతుందని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటారు. కాసేపటి తర్వాత నీరజ్ కూడా తినడం ప్రారంభిస్తాడు.ఉప్పులు, కారాలు భరించలేక ఎలా తింటున్నారు అంటూ గోల గోల చేసేస్తాడు. నేను ఉప్పు, కారాలు బానే వేశాను అంటుంది శారదమ్మ. అయినా అలా తినేయడమేనా చెప్పాలి కదా అంటూ అనుని మందలిస్తుంది.