నయనతార వద్ద అత్యంత ఖరీదైన కారు, ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. విజయ్‌ కారు కంటే కాస్ట్లీ

Published : Nov 26, 2025, 05:40 PM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇటీవల అత్యంత ఖరీదైన కారుని కొనుగోలు చేసింది. రోల్స్ రాయిస్‌ బ్రాండ్‌కి చెందిన ఈ కారు ధర దళపతి విజయ్‌ రోల్స్ రాయిస్‌ కంటే కాస్ల్టీ కావడం విశేషం. 

PREV
15
సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తోన్న నయనతార

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు సౌత్‌లోనే ఎవరికీ లేని స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తోంది. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా రాణిస్తోంది. ఓవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తూనే మరోవైపు కమర్షియల్‌ మూవీస్‌ చేస్తోంది. బిగ్‌ స్టార్స్ తోనూ జోడీ కడుతోంది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగులో రెండు చిత్రాలు చేస్తోంది. చిరంజీవితో `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది. కొత్తగా బాలకృష్ణతో `ఎన్బీకే111` మూవీ చేస్తోంది. ఇది బుధవారమే ప్రారంభమైంది.

25
నయనతారకి రోల్స్ రాయిస్‌ కార్ గిఫ్ట్

స్టార్‌ ఇమేజ్‌లోనే కాదు, రాయల్‌ లైఫ్‌ని లీడ్‌ చేయడంలోనూ నయతార ముందే ఉంది. ఇటీవల ఆమె అదిరిపోయే కొత్త కారు కొన్నది. కార్లలో అత్యంత కాస్ట్లీగా భావించే రోల్స్ రాయిస్‌ స్పెక్టర్‌ మోడల్‌కి చెందిన కారుని కొనుగోలు చేసింది. అయితే నయనతార పుట్టిన రోజు సందర్భంగా భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చాడట. నయనతార ఈ నెల 18న పుట్టిన రోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నయన్‌కి రోల్స్ రాయిస్‌ స్పెక్టర్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.

35
కోలీవుడ్‌లోనే అత్యంత ఖరీదైన కార్‌ నయన్‌ సొంతం

ఈ సందర్భంగా కారు వద్ద ఇద్దరు పిల్లలతో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ దిగిన ఫోటో వైరల్‌ అయ్యింది. అయితే ఈ కారు ధర తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. కోలీవుడ్‌లోనే ఇంతటి ఖరీదైన కారు మరెవ్వరీ వద్ద కూడా లేదు. ఈ కార్‌ కాస్ట్ రూ.10కోట్లు ఉంటుందట. దీంతో కోలీవుడ్‌లో అత్యంత ఖరీదైన కారున్న స్టార్‌గా నయనతార నిలిచింది.

45
దళపతి విజయ్‌ కార్‌ కంటే నయనతార కార్‌ కాస్ట్ ఎక్కువ

నయనతార కార్ కాస్ట్ దళపతి విజయ్‌ రోల్స్ రాయిస్‌ కార్‌ కంటే కాస్ల్టీ కావడం విశేషం. విజయ్‌ గతేడాది రోల్స్ రాయిస్‌ ఘోస్ట్ మోడల్‌కి చెందిన కారుని కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ.8కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన నయనతార తమిళంలోనే అత్యంత ఖరీదైన కారున్న సెలబ్రిటీగా నిలవడం విశేషం.

55
టాలీవుడ్‌లో మెగాస్టార్‌ వద్ద అత్యంత ఖరీదైన కార్‌

తెలుగులోనూ చిరంజీవి వద్ద ఈ రోల్స్ రాయిస్‌ కారుంది. చిరంజీవి  `రోల్స్ రాయిస్‌ పాంథమ్‌` మోడల్‌ కారుని మెయింటేన్‌ చేస్తున్నారు. దీన్ని చాలాకాలంగా ఆయన వాడుతున్నారు. దీని ధర రూ.11కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే రామ్‌ చరణ్‌ వద్ద కూడా రోల్స్ రాయిస్‌ కారు ఉంది. దీని ధర ఏడున్నర కోట్లు ఉంటుందట. ఇటీవల చరణ్‌ ఎయిర్‌పోర్ట్ లో ఈ రోల్స్ రాయిస్‌ కారుతో మెరిసిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలైనా, కార్పొరేట్లు అయినా, రాజకీయ నాయకులైనా ఈ కారుని తమ స్టేటస్‌ కి ప్రతీకగా భావిస్తుంటారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories