నయనతార పై నోటి దురుసు.. ఎంపీకి సైలెంట్ కౌంటర్ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్

Published : Mar 18, 2026, 04:12 PM IST

నటి నయనతారపై మాజీ మంత్రి సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వివాదంపై నయన్ తనదైన శైలిలో స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఇంతకీ నయనతార సైలెంట్ గా వేసిన సెటైర్ ఏంటో తెలుసా? 

PREV
14
నయనతారపై నోటి దురుసు..

తమిళనాడులో ఎన్నికల తేదీ ప్రకటించడంతో, రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఏఐఏడీఎంకే నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగం చేసిన ప్రసంగం తమిళ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. సీఎం స్టాలిన్‌ను విమర్శించే క్రమంలో, ఆయన నటి నయనతార పేరును అనవసరంగా లాగడం వివాదాన్ని రేపింది.

24
నయనతార సైలెంట్ కౌంటర్..

గతంలో రాధారవి వంటి వారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నయన్ వెంటనే స్పందించారు. కానీ ఈసారి నేరుగా కాకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. 'వర్షం ఎవరిపై పడుతున్నానో చూడదు. మీ ప్రేమ కూడా అలానే ఉండాలి' అని రాసుకొచ్చారు. ఇది షణ్ముగం వ్యాఖ్యలకు నయన్ ఇచ్చిన పరోక్ష సమాధానం అని అభిమానులు అంటున్నారు.

34
విగ్నేష్ స్పందించకపోవడంపై చర్చ..
తన గురించి ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా ప్రేమను పంచుతానని నయన్ చెప్పకనే చెప్పారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే, తన భార్యపై ఇలాంటి వ్యాఖ్యలు వస్తే భర్త విఘ్నేశ్ శివన్ ఇంకా స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు, నటి కుష్బూ ఈ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు.
44
స్పందించిన నటి కుష్బూ
బీజేపీ నేత కుష్బూ సుందర్, 'నటీనటులు చర్చలకు వస్తువులు కారు. ఒకరిని కించపరచడానికి మహిళల గుర్తింపును వాడుకోవడం వారి మానసిక స్థితిని చూపిస్తుంది' అని ట్వీట్ చేశారు. అయితే ఆమె సీవీ షణ్ముగం పేరు ప్రస్తావించలేదు. పేరు చెప్పకుండా ఖండిస్తే ఏం లాభం? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా స్పందించింది.
Read more Photos on
click me!

Recommended Stories