బన్నీ నుంచి మహేష్ బాబు వరకు : హైదరాబాద్‌లో మన స్టార్ హీరోల రెస్టారెంట్లు ఇవే!

Published : Mar 18, 2026, 12:44 PM IST

Celebrity Restaurants Hyderabad: విరాట్ కోహ్లీ నుంచి మహేష్ బాబు వరకు హైదరాబాద్‌లో సెలబ్రిటీలు నిర్వహిస్తున్న టాప్ రెస్టారెంట్లు, వాటి లొకేషన్లు, ప్రత్యేకతల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
19
హైదరాబాద్‌లో సెలబ్రిటీ రెస్టారెంట్లు: కోహ్లీ నుంచి మహేష్ బాబు వరకు

హైదరాబాద్ నగరం కేవలం బిర్యానీకే కాదు, గ్లామర్‌కు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇటీవల కాలంలో సినీ తారలు, క్రికెటర్లు కేవలం కెమెరా ముందే కాకుండా, వ్యాపార రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగంపై మన తారలు మక్కువ చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో టాప్ సెలబ్రిటీలు నిర్వహిస్తున్న రెస్టారెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాలు గమనిస్తే..

29
1. ఏఎన్ (AN) - మహేష్ బాబు-నమ్రత (బంజారాహిల్స్)

సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి AN రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రముఖ 'మినర్వా కాఫీ షాప్' భాగస్వామ్యంతో బంజారాహిల్స్‌లో ఈ రెస్టారెంట్ నడుస్తోంది. ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ నుంచి మల్టీ కుజైన్ వరకు అద్భుతమైన రుచులు అందుబాటులో ఉంటాయి. ప్యాలెస్ లాంటి అంబియన్స్ ఇక్కడి ప్రత్యేకత. మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక ఫేవరెట్ స్పాట్.

39
2. వన్8 కమ్యూన్ (ONE8 Commune) - విరాట్ కోహ్లీ (హైటెక్ సిటీ)

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన 'వన్8 కమ్యూన్' రెస్టారెంట్ హైటెక్ సిటీలో ఉంది. ఆధునిక ఆహారపు అలవాట్లు, స్టైలిష్ ఇంటీరియర్స్‌తో ఈ రెస్టారెంట్ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. కోహ్లీకి ఇష్టమైన కొన్ని ప్రత్యేక వంటకాలు కూడా ఇక్కడ మెనూలో అందుబాటులో ఉండటం గమనార్హం.

49
3. షోయు (SHOYU) - నాగ చైతన్య (కావురి హిల్స్)

అక్కినేని వారసుడు నాగ చైతన్యకు ఆహారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన తన అభిరుచికి తగ్గట్టుగా 'షోయు' అనే ఏషియన్ కుజైన్ రెస్టారెంట్‌ను కావురి హిల్స్‌లో నడుపుతున్నారు. ఇక్కడ జపనీస్, ఇతర ఆసియా దేశాల రుచులు కూడా చాలా ఫేమస్. నాణ్యమైన ఆహారానికి ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు.

59
4. బఫెలో వైల్డ్ వింగ్స్ (Buffalo Wild Wings) - అల్లు అర్జున్ (జూబ్లీ హిల్స్)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్‌లో 'బఫెలో వైల్డ్ వింగ్స్' ఫ్రాంచైజీని నిర్వహిస్తున్నారు. ఇది అంతర్జాతీయ బ్రాండ్ అయినప్పటికీ, బన్నీ భాగస్వామ్యం ఉండటంతో హైదరాబాద్‌లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. స్పోర్ట్స్ బార్ తరహాలో ఉండే ఈ రెస్టారెంట్ వింగ్స్, చిల్-అవుట్ జోన్‌కు ప్రసిద్ధి.

69
5. ఎన్ గ్రిల్ & ఎన్ ఏషియన్ (N Grill & N Asian) - నాగార్జున (జూబ్లీ హిల్స్)

బిజినెస్ మ్యాన్‌గా నాగార్జున స్టైలే వేరు. ఆయన జూబ్లీ హిల్స్‌లో 'ఎన్ గ్రిల్, ఎన్ ఏషియన్' వంటి ప్రతిష్ఠాత్మక రెస్టారెంట్లను నడుపుతున్నారు. ఇక్కడ లభించే వెస్ట్రన్ గ్రిల్స్, ఏషియన్ డిష్‌లు ఫుడ్ లవర్స్‌ను మైమరిపిస్తాయి. సెలబ్రిటీలు తరచుగా సందర్శించే రెస్టారెంట్లలో ఇవి ముందు వరుసలో ఉంటాయి.

79
6. జోహార్ఫా (Joharfa) - మహ్మద్ సిరాజ్ (బంజారా హిల్స్)

హైదరాబాదీ గల్లీల నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన మహ్మద్ సిరాజ్, బంజారా హిల్స్‌లో 'జోహార్ఫా' అనే రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తన మూలాలను మర్చిపోకుండా సంప్రదాయ రుచులను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో సిరాజ్ ఈ వెంచర్‌ను మొదలుపెట్టారు.

89
7. శాంక్చురీ & బ్రాడ్‌వే (SANCTUARY + BROADWAY) - రాణా దగ్గుపాటి

భల్లాలదేవ రాణా దగ్గుపాటి ఫిల్మ్ నగర్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో 'శాంక్చురీ, బ్రాడ్‌వే' వంటి రెస్టారెంట్లలో భాగస్వామిగా ఉన్నారు. ఇవి కేవలం భోజనానికే కాకుండా, అద్భుతమైన వాతావరణానికి, సోషల్ గ్యాదరింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి.

99
8. ఇతర ప్రముఖ సెలబ్రిటీ రెస్టారెంట్లు
  • గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్: విజయ్ దేవరకొండ & ఆనంద్ దేవరకొండ (ఖాజాగూడ).
  • టీ గ్రిల్ (T Grill): హీరో నితిన్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్).
  • వివాహ భోజనంబు: సందీప్ కిషన్ (జూబ్లీ హిల్స్) - ఇక్కడ తెలుగు సంప్రదాయ భోజనం చాలా ఫేమస్.
  • ఆరంభ్ (AARAMBH): రకుల్ ప్రీత్ సింగ్ (మనికొండ) - హెల్తీ డైట్ తీసుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
  • బ్యారక్స్ & ఆంటెరూమ్ (BARRACKS & ANTEROOM): అంబటి రాయుడు (సైనిక్ పూరి).

హైదరాబాద్‌లోని ఈ రెస్టారెంట్లు కేవలం సెలబ్రిటీల పేర్లతోనే కాకుండా, వాటి రుచి, క్వాలిటీతో కూడా కస్టమర్లను మెప్పిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories