నయనతార ను వదలని వివాదాలు, మరో సారి చిక్కుల్లో లేడీ సూపర్ స్టార్

Published : Sep 10, 2025, 08:24 PM IST

వరుస వివాదాలతో వైరల్ అవుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. పెళ్లి డాక్యుమెంటరీ విషయంలో ఇప్పటికే ధనుష్ తో కోర్టు కేసు నడుస్తుండగా, తాజాగా మరోసారి హైకోర్డు నుంచి ఆమెకు నోటీసులు అందాయి. 

PREV
16

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్ గా ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ నయనతార. తన నటనతో పాటు తన ప్రిన్సిపల్స్‌ తో ఆమె ప్రత్యేకమైన నటిగా గుర్తింపు సాధించారు. 40 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం ఇమేజ్ తగ్గకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది నయనతార. రెమ్యునరేషన్ విషయంలో కూడా టాప్ లో ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. స్టార్ హీరోల సరసన హిరోయిన్ గా నటిస్తూ.. అదరగొడుతోంది. సౌత్ లో తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకుపోతోంది నయన్.

26

స్టార్ సీనియర్ హీరోల జతగా నటిస్తూ స్టార్ డమ్ ను కొనసాగిస్తోంది నయనతార. ఇప్పటికీ ఫామ్ ను కొనసాగిస్తూ..యంగ్ హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ను అందుకుంటోంది. సినిమాలతో పాటు వివాదాలతో కూడా పాపురల్ అయిన నయనతార, ఇప్పటికీ ఏదో ఒక వివాదంతో వైరల్ వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఆమె సరోగసి విషయంలో కూడా వివాదం అయిన నయనతార, ప్రస్తుతం తన పెళ్ళి డాక్యూమెంటరీ విషయంలో హీరో ధనుష్ తో వివాదం కొనసాగతోంది.

36

లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆమె డాక్యుమెంటరీ ‘Nayanthara: Beyond the Fairytale’ ప్రస్తుతం లీగల్ ఇష్యూలలో కూరుకుపోయింది. ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు సంబంధించిన ఫుటేజ్‌ను నిర్మాతల అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రముఖి సినిమా కాపీరైట్ హోల్డర్ AP ఇంటర్నేషనల్, మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు చేసింది. వారి ఆరోపణల ప్రకారం, డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు చెందిన విజువల్స్ అనుమతి లేకుండా చేర్చడమే కాకుండా, తాము ఇచ్చిన నోటీసులను కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు.

46

ఈ డాక్యుమెంటరీని డార్క్ స్టూడియో నిర్మించింది. నవంబర్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ విడుదలయ్యింది. అయితే, అప్పటికే పంపిన నోటీసుల అనంతరం కూడా, సంబంధిత ఫుటేజ్‌ను తొలగించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. ఈ వివాదంలో నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా స్పందించాల్సి ఉండగా. వారు స్పందించలేదు. దాంతో మద్రాస్ హైకోర్టు, నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసి, అక్టోబర్ 6, 2025లోపు పూర్తి సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.

56

ఇంతకముందు, నానుమ్ రౌడీధాన్ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ అనుమతి లేకుండా ఉపయోగించారని, నటుడు ధనుష్ తరపున కూడా మద్రాస్ హైకోర్టులో ఒక కేసు దాఖలైంది. ఈ చిత్రం నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ కూడా అనుమతి ఇవ్వలేదని, ఈ విషయంలో విచారణ కొనసాగుతుందని తెలుస్తోంది. AP ఇంటర్నేషనల్ వారి పిటిషన్‌లో, డాక్యుమెంటరీ నుండి చంద్రముఖి ఫుటేజ్‌ను వెంటనే తొలగించాలని, ఫుటేజ్ వలన పొందిన లాభాలను తాము సమర్పించాలని, అలాగే రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విచారణను పరిశీలించిన న్యాయమూర్తి సెంథిల్‌కుమార్, డార్క్ స్టూడియో తరఫున సమాధానం కోసం అక్టోబర్ 6 వరకూ గడువు ఇచ్చారు.

66

ప్రస్తుతం నయనతార తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుసగా సినిమాలు చేస్తోంది. లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన నయనతార కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాలో నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories