
ఒకప్పుడు హీరోలకు మాత్రమే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేది. వారు కోట్లు తీసుకుంటున్న రోజుల్లో కూడా హీరోయిన్లు లక్షలతో సరిపెట్టుకున్న రోజులు ఉన్నాయి. కాని ఇప్పుడు హీరోలను మించి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు కొంత మంది హీరోయిన్లు. బాలీవుడ్ లో 20 నుంచి 30 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే తారలు ఉన్నారు. ఇక ఇప్పుడు సౌత్ లో కూడా హీరోయిన్ల రెమ్యునరేషన్ భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో 40 ఏళ్ల ఓ హీరోయిన్ అయితే ఎప్పటికప్పుడు రేటు పెంచుతూ వస్తోంది. 50 సెకండ్ల సీన్ కోసమే 5 కోట్లు వసూలు చేసిందట సీనియర్ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు నయనతార. కేరళకు చెందిన నయనతార మలయాళ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయన్ గా గుర్తింపు పొందింది. యాంకర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి, ఆసక్తి లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార, ఆతరువాత కెరీర్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చింది. కెరీర్‌లో వచ్చిన బ్రేకప్స్ తర్వాత తాను పరిశ్రమను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ, మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చి తన స్థానాన్ని నిలబెట్టుకుంది నయనతార. రజనీకాంత్, చిరంజీవి, షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్ లాంటి పాన్ ఇండియా స్టార్లతో కలిసి నటించిన నయనతార, తెలుగు , తమిళ భాషలలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టి భారీ విజయాన్ని సాధించింది. షారుక్ ఖాన్ జోడీగా ఆమె నటించిన జవాన్ సినిమా 1000 కోట్ల వసూళ్లు సాధించి, నార్త్ లో కూడా నయనతారను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. ఆతరువాత అక్కడ సినిమాలేవి చేయకపోయినా.. నయనతార ఇమేజ్ మాత్రం భారీగా పెరిగిపోయింది.
ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారనే అపోహను చెరిపేసింది సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార. రెమ్యునరేషన్ విషయంలో ఎప్పటకప్పుడు ఆమె పెంచుకుంటూ వెళ్లున్నట్టు తెలుస్తోంది. ఒక్క సినిమాకు ఆమె 15 కోట్లకుపైగా వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఆమధ్య కాలంలో నయనతార చేసిన 50 సెకన్ల టీవీ ప్రకటన కోసం రూ.5 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది హై ఎండోర్స్‌మెంట్ డీల్‌గా గుర్తించవచ్చు. టాటా స్కై కోసం నయనతార ఈ ప్రకటనలో నటించింది. అయితే ఆమె రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు.
ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో 2018లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ నటి నయనతార. 20 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 75కి పైగా చిత్రాల్లో నటించి అనేక అవార్డులు అందుకుంది. తన సినిమా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసినా.. ఆర్ధికంగా మాత్రం పక్కా ప్లాన్ తో వెళ్తోంది నయన్. సినమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతోంది. తాను కూడా సొంతంగా కొన్ని వ్యాపారాలు స్టార్ట్ చేసింది. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంది బ్యూటీ. అంతే కాదు సౌత్ తో ప్రైవేట్ జట్ కలిగిన హీరోయిన్ గా రికార్డ్ సాధించింది నయనతార. నటనతో పాటు నిర్మాతగా కూడా మారింది నయన్, రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నడిపిస్తూ పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించింది నయనతార.
స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లోనే రెండు సార్లు ప్రేమలో పడిన నయన్, రెండు బ్రేకప్స్ తో ఇండస్ట్రీలో కనిపించకుండాపోతుంది అనుకున్నారంతా. ఎందుకంటే నయన్ రెండు ప్రేమలు వివాదాస్పదం అయ్యాయి. శింబుతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అది అయిపోయిన తరువాత స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవాతో పెళ్లికి రెడీ అయ్యింది నయన్. కాని ప్రభుదేవ భార్య చేసిన గొడవల కారణంగా వీరి బంధం తెగిపోయింది. ఆ తరువాత కొంత కాలానికి దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన ఆమె, దాదాపు 5 ఏళ్ళు రిలేషన్ లో ఉంది. ఆతరువాత విఘ్నేష్ ను వివాహం చేసుకున్న నయనతార, సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చింది.
తన పెళ్లిని డాక్యుమెంటరీగా తెరకెక్కించడానికి ఓ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌తో డీల్ కుదుర్చుకుని ఏకంగా రూ.25 కోట్లు సంపాదించింది నయనతార. ఈ డాక్యుమెంటరీ విషయంలో కూడా వివాదంగా మారింది నటి. విఘ్నేష్ తో ప్రేమలో పడ్డ నానుమ్ రౌడీ థాన్ సినిమాలోని క్లిప్ ను తన డాక్యుమెంటరీలో పర్మీషన్ లేకుండా వాడటంతో, ఈ సినిమా నిర్మాత ధనుష్ ఈ విషయంలో లీగర్ లో ప్రొసీడ్ అయ్యారు. దాంతో ధనుష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది నయన్. ఆ వివాదం ఇంకా కోర్డులో కొనసాగుతూనే ఉంది. ఇదొక్కటే కాదు సరోగసి విషయంలో కూడా వివాదం అయ్యింది నయనతార. ఇండస్ట్రీలో మరికొన్ని విషయాల్లో ఆమె తీరు వివాదాలకు దారి తీసింది. ఇలా 40 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, స్టార్ ఇమేజ్ ను కొనసాగిస్తోంది నయనతార. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడీగా అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తోంది.