బ్యాచిలర్ హీరోలకు గురువులా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఎవరైనా యంగ్ స్టార్స్ ను పెళ్లెప్పుడు అంటే.. ప్రభాస్ పెళ్లి తరువాతే మా పెళ్లి అనేస్తున్నారు.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ లో ప్రభాస్.. మంచి ఫామ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా నిలిచిపోయారు. ప్రభాస్ కు 46 ఏళ్లు వచ్చినా.. పెళ్లిపై ఇంత వరకూ నోరెత్తడంలేదు.. ఎప్పుడు చేసుకుంటాడో క్లారిటీ కూడా ఇవ్వడంలేదు. కానీ ఆయన పెళ్లిపై రకరకాల వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. అనుష్క తో లవ్ లో ఉన్నాడని కొందరు.. లేదు వైజాగ్ లో బిజినెస్ మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లంటు మరికొందరు.. ఇలా రకరకాల రూమర్స్ నెట్టింట రోజుకొక్కటి పుట్టుకోస్తుంది. ప్రభాస్ మాత్రం అఫీషియల్ గా ఇంత వరకూ తన పెళ్లి గురించి మాట్లాడింది లేదు... కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోలంతా ప్రభాస్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.. ప్రభాస్ పెళ్లి తరువాతే మా పెళ్లి అనేస్తున్నారు.
25
బ్యాచిలర్ గురు గా మారిపోయిన ప్రభాస్..
పెళ్లెప్పుడు అని ప్రభాస్ ను అడిగితే.. సల్మాన్ ఖాన్ పెళ్లి తరువాత నా పెళ్లి అని సరదాగా సమాధానం చెప్పేవారు.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలలో కొంత మంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే.. ప్రభాస్ పెళ్లి తరువాత అని అనేస్తున్నారు. రీసెంట్ గా తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి కూడా ఇదే సమాధానం ఇచ్చాడు. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ నవీన్ పొలిశెట్టి మరోక అద్భుతమైన సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ లో నవీన్ పొలిశెట్టి మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
35
ప్రభాస్ పెళ్లి అయిన వెంటనే..
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంటాడు నవీన్ పొలిశెట్టి... తన సినిమాల అప్ డేట్స్ తో పాటు.. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటాడు. ఈక్రమంలో ఓ ఈవెంట్ లో నవీన్ కు ఓ ప్రశ్న ఎదురయ్యింది. ఆ ప్రశ్నకు సమాధానం చెపుతూ.. యంగ్ హీరో వేసిన జోకులకు అందరు కడుపుబ్బా నవ్వుకున్నారు. పెళ్లి ఎప్పుడు చేసకోబోతున్నారని విలేకురులు అడగ్గా.. “ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజే… కరెక్ట్‌గా 12 గంటల తర్వాత నేను కూడా పెళ్లి చేసుకుంటా” అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చాడు. ఈ కామెంట్స్ తో అక్కడున్న వారిని ఆకట్టుకున్నాడు నవీన్.
తన కెరీర్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నవీన్ ఎమోషనల్ అయ్యాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ, తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్నానని ఆయన అన్నాడు. ముంబైలో ఒకప్పుడు పెళ్లిళ్లకు హోస్ట్‌గా పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, ఆ అనుభవాలే తనను జీవితంలో మరింత బలంగా నిలబెట్టాయని అన్నారు. ఎంతో కష్టపడి చేసిన ప్రయాణమే తనకు ఈ స్థాయిని తీసుకొచ్చిందని చెప్పారు.
55
గురువుగారి సినిమాతో పాటు..
తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నానని నవీన్ వెల్లడించాడు. తన పాత సినిమా పాత్రల ప్రభావం ఈ సినిమాపై ఉండదని ధీమా వ్యక్తం చేశాడు.ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటీపై స్పందించిన నవీన్ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి మాలాంటి ఎంతో మంది మధ్యతరగతి కుర్రాళ్ల కు స్ఫూర్తి. ఆయన బాటలోనే మేము ఇక్కడి వరకు వచ్చాం. గురువుగారి సినిమాతో పాటు మా సినిమా రావడం ఒత్తిడిని కాదు, ఉత్సాహాన్ని ఇస్తుంది” అని అన్నారు.