బాలకృష్ణ వద్దనుకున్న హీరోయిన్ తో రొమాన్స్ చేయాలనుకున్న తారక్.. ఆ కోరిక ఈ జన్మకి తీరదు, మరీ అంత పిచ్చా ?

Published : Jan 02, 2026, 10:58 AM IST

జూనియర్ ఎన్టీఆర్ కి తన కెరీర్ లో తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. ఓ స్టార్ హీరోయిన్ అంటే తారక్ కి పిచ్చి అట. 20 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్నా ఆమెతో నటించాలని అనుకున్నాడు. 

PREV
15
బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ 

నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎందరో గొప్ప హీరోయిన్లతో నటించారు. విజయశాంతి, రమ్యకృష్ణ, సౌందర్య ఇలా చాలా మంది హీరోయిన్లతో బాలయ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. అయితే అతిలోక సుందరి శ్రీదేవితో బాలకృష్ణ నటించింది చాలా తక్కువ. కేవలం ఒకే ఒక్క సినిమాలో బాలయ్య శ్రీదేవితో నటించారు. 

25
రిజెక్ట్ చేయడానికి కారణం కారణం 

ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. శ్రీదేవిని తన సినిమాల్లో వద్దు అని అనుకోవడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. కానీ నా సినిమాలకు శ్రీదేవి అవసరం లేదు అని అనిపించింది. నా సినిమాల్లో పాత్రకి తగ్గ హీరోయిన్ ని మాత్రమే ఎంపిక చేస్తాను. శ్రీదేవి అందంగా ఉండదు, నటించదు అని కాదు.. కానీ నా సినిమాలకు మీ సెట్ కాదు అని అనిపించినట్లు బాలయ్య తెలిపారు. 

35
జూనియర్ ఎన్టీఆర్ కోరిక

నాన్నగారితో బాగా సెట్ అయింది. ఆ తర్వాత బ్రదర్ చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అద్భుతంగా కనిపించింది అని బాలయ్య తెలిపారు. కొన్ని సినిమాల్లో తానే శ్రీదేవిని రిజెక్ట్ చేశాను అని బాలయ్య తెలిపారు. బాలయ్య రిజెక్ట్ చేసిన శ్రీదేవితో జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ చేయాలనుకున్నారు. ఎలాగైనా ఆమెతో నటించాలి అనేది జూనియర్ ఎన్టీఆర్ కోరిక. 

45
శ్రీదేవి అంటే పిచ్చి 

 గతంలో ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. శ్రీదేవికి కాంపిటీటర్ అయిన జయప్రద తారక్ ని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకి శ్రీదేవి అంటే పిచ్చి అని తెలిపారు. ఆమెని చూస్తుంటే నాకు ఏమైపోతుందో తెలియదు. 

55
తారక్ కోరిక ఇక తీరదు 

ఆమె నాతో నటించడానికి ఎప్పుడు రెడీ అయినా నేను కూడా రెడీగా ఉంటాను అని తారక్ తెలిపారు. శ్రీదేవికి తారక్ కి 20 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. అయితే ఎన్టీఆర్ కోరిక ఇక తీరదు అనే చెప్పాలి. శ్రీదేవి 2018లో మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో శ్రీదేవి, జయప్రద మధ్య విభేదాలు ఉండేవి అని ప్రచారం ఉంది. తారక్ తనకు శ్రీదేవి అంటే ఇష్టం అని జయప్రదకే చెప్పడం కొసమెరుపు. 

Read more Photos on
click me!

Recommended Stories