'అనగనగా ఒక రాజు' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఈ సంక్రాంతికి అసలైన విన్నర్, నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ ?

Published : Jan 13, 2026, 03:45 PM IST

ఈ సంక్రాంతికి మంచి బజ్ తో రిలీజ్ కి రెడీ అవుతున్న మరో చిత్రం అనగనగా ఒక రాజు. బుధవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. 

PREV
15
పండక్కి ముస్తాబైన 'అనగనగా ఒక రాజు'

సంక్రాంతి సినిమాల మధ్య పోరు తుది దశకు చేరుకుంది. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఇక మిగిలింది అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి మాత్రమే. ఈ రెండు చిత్రాలు కూడా జనవరి 14న రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒక రాజు చిత్రంపై మంచి బజ్ ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

25
అనగనగా ఒక రాజు మూవీ ఫస్ట్ రివ్యూ

నవీన్ పోలిశెట్టి కాస్త ఆలస్యమైనప్పటికీ మంచి కథలు ఎంచుకుంటూ వరుస హిట్లు కొడుతున్నారు. ఈ క్రమంలో నవీన్ నటించిన అనగనగా ఒక రాజు చిత్రం కూడా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మారి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎక్స్ క్లూజివ్ గా అందిన సమాచారం మేరకు అనగనగా ఒక రాజు చిత్రం కూడా మంచి హిట్ కాబోతోందని తెలిసింది. నవీన్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు.

35
కంప్లీట్ ఫన్ రైడ్

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, భీమవరం బాలుమ అనే సాంగ్ సంక్రాంతి వైబ్ తీసుకువచ్చాయి. ట్రైలర్ తో ఈ చిత్రం ఫన్ రైడ్ గా ఉండబోతోందని అర్థం అయింది. అందిన సమాచారం మేరకు ఈ చిత్రం కంప్లీట్ ఫన్ రైడ్ గా, హిలేరియస్ గా ఉండబోతోంది. సినిమా గ్రాఫ్ పడిపోతున్న ప్రతి సారీ ఒక అద్భుతమైన కామెడీ ఎపిసోడ్ ఉంటుంది. దీనితో ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ఎంజాయ్ చేస్తారు.

45
మరోసారి బుల్లిరాజు హంగామా

కామెడీ సీన్లతో పాటు ఎంగేజింగ్ గా అనిపించే సన్నివేశాలు కూడా అక్కడక్కడా ఉంటాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ అలియాస్ బుల్లి రాజు ఈ చిత్రంలో నటిస్తున్నాడు. అతడికి, నవీన్ పోలిశెట్టికి, డాగ్ కి సంబంధించిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయట. మరోవైపు పెళ్లి కోసం నవీన్ పోలిశెట్టి పడే తిప్పలు ఆసక్తికరంగా ఉంటూ ఎంగేజ్ చేస్తాయి. 2 గంటల 30 నిమిషాల రన్ టైంతో ఈ చిత్రం ఉండబోతోంది. కథ సింపుల్ గా మొదలై ఆ తర్వాత రెగ్యులర్ ఇంటెర్వెల్స్ లలో ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలని పక్కాగా డిజైన్ చేశారట.

55
నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో హిట్

ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా అందంగా కనిపిస్తూనే కామెడీ టైమింగ్ తో మెప్పిస్తుంది అని అంటున్నారు. మీనాక్షికి కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథ కాబట్టి సంక్రాంతి వాతావరణం ఈ చిత్రంలో కనిపిస్తుంది. దీనికి తోడు ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ అన్నింటినీ రెడీ చేసి ఉంచారు. ఓవరాల్ గా ఈ సంక్రాంతికి అసలైన విన్నర్ అయ్యే ఛాన్స్ అనగనగా ఒక రాజు చిత్రానికి ఉందని అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories