రాజవంశానికి చెందిన హీరోయిన్, మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకున్న నటి ఎవరో తెలుసా?

Published : Jan 13, 2026, 03:35 PM IST

ఆమె రాజవంశానికి చెందిన హీరోయిన్.. వేల కోట్లకు వారసురాలు, చిన్న వయస్సులోనే పెళ్లి విడాకులు చూసిన ఆ నటి.. ఈమధ్య కాలంలో మరో స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఎవరా తార.

PREV
15
రాజవంశానికి చెందిన హీరోయిన్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేని తారలు ఎందరో ఉన్నారు. సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు కూడా ఉన్నారు. హీరోలు, హీరోయిన్లలో కొంత మంది గురించి అందరికి తెలియదు. వారి గురించి తెలిసిన తరువాత అవునా.. నిజమా అని అంటుంటారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ అధితి రావు హైదరీ. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ నటి.. రాజవంశం నుంచి వచ్చింది. ఆమె మాజీ ప్రధానికి మనవరాలు కూడా.

25
మాజీ ప్రధానమంత్రి మనవరాలు..

అదితి రావు హైదరీ... తెలుగు ఫ్యామిలీకి చెందిన ఈ నటి.. ముందుగా బాలీవుడ్ సినిమాలతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆతరువాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అదితి కాస్త లేట్ గాఇండస్ట్రీకి వచ్చింది. అయితే అదితి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. ఆమెకు రెండు వైపుల నుంచి భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆమె తాత (తండ్రి తండ్రి )అక్బర్ హైదరీ. అప్పట్లో హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఆయన పనిచేశారు. అలాగే మరో తాత రామేశ్వరరావు (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశులు.

35
పెళ్లి, విడాకుల తరువాత సినిమాల్లోకి..

సినిమాల్లోకి రాకముందే అదితి రావు హైదరీకి పెళ్లి జరిగిపోయింది. ఆమె మొదట బాలీవుడ్ హీరో, నిర్మాత అయిన సత్యదేవ్ మిశ్రాను పెళ్ళాడింది. నాలుగేళ్లు వీరు కలిసి జీవించారు. ఆతరువాత వీరి మధ్య గొడవలు రావడంతో.. విడిపోయి.. విడాకులు తీసుకున్నారు. విడాకుల తరువాత అదితి రావు పూర్తి సమయాన్ని తన కెరీర్ పై పెట్టింది. మోడలింగ్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఆతరువాత ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి.

45
సిద్ధార్ద్ తో ప్రేమలో పడ్డ అదితి..

హీరోయిన్ గా నాలుగు భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది అదితి. సౌత్ సినిమాల్లో నటిస్తున్నటైమ్ లోనే.. మరోసారి ప్రేమలో పడింది. తెలుగులో మహాసముద్రం సినిమాతో తనతో నటించిన కో ఆర్టిస్ట్ సిద్ధార్ద్ తో ప్రేమలో పడింది. దాదాపు రెండు మూడేళ్ళు డేటింగ్ చేసిన ఈ జంట.. లాస్ట్ ఇయర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఎవరిసినిమాలు వారు చేసుకుంటూ.. ఫ్యామిలీ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

55
అదితిరావు సంపాదన..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అదితికి దగ్గరి బంధువు. అదితీ రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోయారు. దీంతో తన తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చేసింది. 2006లో సినీ రంగంలోకి ఆమె అడుగుపెట్టింది. అయితే సినిమాలు.. ఇతర మార్గాల్లో అదితి తన సొంతంగా 100 కోట్ల వరకూ ఆస్తులు సంపాదించనట్టు సమాచారం. సినిమాకు మూడు కోట్ల వరకూ ఆమె రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories