నయనతార 120 కోట్ల ఇల్లు, కళ్లు చెదిరే ఇంటీరియర్, మైమరచిపోయో గార్డెన్ చూశారా?

Published : Jan 13, 2026, 02:53 PM IST

Nayanthara Home Tour : చెన్నైలో రజినీకాంత్, ధనుష్  లాంటి స్టార్స్ నివసిస్తున్న  అత్యంత ఖరీదైన పోయెస్ గార్డెన్‌లో ఇల్లు కొనడం చాలా మందికి ఒక  కల. నయనతార ఆ కలను నెరవేర్చుకుంది. 120 కోట్ల విలువ చేసే ఆ ఇంటి లోపల ప్రత్యేకతలు ఏంటో తెలుసా? 

PREV
17
సౌత్ ఫిల్మ్స్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటి..

దక్షిణ భారతదేశంలోని అత్యంత , ఖరీదైన పిన్ కోడ్‌లలో నివసించే సెలబ్రిటీల జాబితాలో నయనతార కూడా ఉంది.  తమిళం, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న  నయనతార.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే  హీరోయిన్లలో  ఒకరిగా ఉన్నారు. ఆమె జీవనశైలి, ఆస్తుల పెట్టుబడులు, లగ్జరీ హౌస్,  రియల్ ఎస్టేట్‌ బిజినెస్  అందరు హీరోయిన్ల కంటే నయన్ ను ప్రత్యేకంగా నిలిపాయి. 

27
16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నయన్ ఇల్లు..

నయనతార ఆమె కలల ఇంటిని  ఎందరో స్టార్స్ కు నివాసమైన పోయెస్ గార్డెన్‌లో కట్టుకుంది. ఇది చెన్నైలోని అత్యంత భద్రత కలిగి ఉన్న ప్రాంతమైన పోయెస్ గార్డెన్‌లో నయన్ తన భర్తతో కలిసి నివసిస్తోంది.  రజనీకాంత్, ఇందిరా నూయి, ధనుష్, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత  సహా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అందుకే ఇది  అధిక భద్రత కలిగిన ప్రాంతంగా మారిపోయింది. 

సుమారు 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ బంగ్లా నయనతారకు ప్రశాంతమైన నిలయం. ఇది ఆధునిక సౌకర్యాలతో నిండి ఉంది. దీనికి తోడు, నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ చెన్నైలోని అల్వార్‌పేటలోని వీనస్ కాలనీలో ఉన్న సుమారు 7,000 చదరపు అడుగుల వింటేజ్ బంగ్లాను సొంత కార్యాలయం, క్రియేటివ్ స్టూడియోగా వాడుతున్నారు. ఈ బంగ్లా కథా చర్చలు, నిర్మాణ సమావేశాలు, సృజనాత్మక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.

37
ఈ రెండు ప్రదేశాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది?

నయనతార ఎంచుకున్న ఈ రెండు ప్రదేశాలు కేవలం ప్రెస్టేజ్  కోసం మాత్రమే కాదు. పోయెస్ గార్డెన్ సెలబ్రిటీలకు అవసరమైన ఉన్నత స్థాయి ఏకాంతాన్ని, భద్రతను అందిస్తుంది. వీనస్ కాలనీ అల్వార్‌పేటలోని పచ్చని వీధులతో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కోరుకునే నయనతార  ఈరెండు ప్లేస్ లలో తమ నివాసాలుాగా మార్చుకుంది.  

47
నయనతార ఆస్తి, వ్యాపారాలు..

2026 ప్రారంభం నాటికి నయనతార  ఆస్తుల మొత్తం విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పోయెస్ గార్డెన్‌లోని ఆమె ఇంటి విలువే.. దాదాపు 120 కోట్లుగా అంచనా వేశారు. ఇది కాకుండా, హైదరాబాద్‌లోని అత్యంత కాస్ట్లీ ప్లేస్ అయిన  బంజారా హిల్స్‌లో రెండు ప్రీమియం నివాసాలు ఉన్నాయట. వాటి విలువ ఒక్కొక్కటి సుమారు ₹15 కోట్లు. ముంబైలో కూడా ఆమెకు ఒక విలాసవంతమైన ఫ్లాట్ ఉన్నట్టు తెలుస్తోంది.

57
50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్

ప్రతి సినిమాకు సుమారు 10 కోట్లు పైనే రెమ్యునరేషన్ తీసుకునే  నయనతార, నటనతో పాటు రౌడీ పిక్చర్స్, ఫెమి9, 9స్కిన్ వంటి వ్యాపారాల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తున్నారు. వీటన్నిటితో ఆమె మొత్తం నికర విలువ సుమారు ₹250 కోట్లుగా అంచనా. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, విలాసవంతమైన కార్లు కూడా ఆమె స్మార్ట్ పెట్టుబడులలో భాగం. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఆస్తి విలువ 50 కోట్లు  ఉంటుందని అంచన. 

67
నయనతార ఇంటి ఇంటీరియర్ డిజైన్

నయనతార ఇళ్ల ఇంటీరియర్ డిజైన్ , “మినిమలిస్ట్ ఆధునికత”ల అందమైన కలయిక. వీనస్ కాలనీలోని హోమ్-స్టూడియోలో మట్టి రంగుల పాలెట్, రట్టన్ కుర్చీలు, లినెన్ కర్టెన్లు, చేనేత కార్పెట్లు ఆకట్టుకుంటాయి. దక్షిణ భారత మూలాలను ప్రతిబింబించేలా చేతితో చెక్కిన టేకు చెక్క స్తంభాలు, పచ్చని ప్రవేశ ద్వారం ఈ ఇంటికి ప్రత్యేకతను తీసుకువచ్చాయి. 

77
పోయెస్ గార్డెన్‌లోని ఇల్లు ప్రత్యేకత..

పోయెస్ గార్డెన్‌లోని ఆమె ప్రధాన ఇల్లు మరింత ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రైవేట్ హోమ్ థియేటర్, పూర్తి సదుపాయాలున్న జిమ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. గోడలను అలంకరించిన అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్, కుటుంబ జ్ఞాపకాల ఫోటో గ్యాలరీ ఇంటికి వ్యక్తిగత స్పర్శను ఇస్తాయి. పెద్ద గాజు తలుపులు బాల్కనీలోకి తెరుచుకుంటాయి; ఇక్కడ నయనతార ఉదయం యోగా చేసి, కాఫీ తాగుతూ చెన్నై పచ్చని వాతావరణాన్ని ఆస్వాదిస్తారని ఆమె సన్నిహితులు చెబుతారు.

మొత్తంమీద, నయనతార నివాసాలు కేవలం విలాసవంతమైన భవనాలు కావు; అవి ఆమె వ్యక్తిత్వం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సృజనాత్మకతకు ప్రతిబింబాలు. నటిగా మాత్రమే కాకుండా, విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందిన లేడీ సూపర్‌స్టార్ నయనతార, తన ఇళ్ల ద్వారా కూడా దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా నిరూపించుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories