కండలు పెంచిన నాని, 8 భాషల్లో భారీగా ప్లాన్ చేసిన నేచురల్ స్టార్

Published : Sep 09, 2025, 05:46 PM IST

నేచురల్ స్టార్ నాని తన సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అభిమానులకు ప్రత్యేకంగా ఒక సర్‌ప్రైజ్‌ను అందించారు. 

PREV
14

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన నాని, అష్టాచెమ్మా సినిమాతో హీరోగా మారారు.నేచురల్ స్టార్ నాని తన సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ, వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈమధ్య కాలంలో దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలతో కమర్షియల్‌గా, కంటెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాని "ప్యారడైజ్" అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈసినిమాలో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు నాని. ఇప్పటికే వచ్చిన అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఈ చిత్రం 2026 మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది.

24

నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తున్నారు. మోనాటనీ నుంచి బయటకు వచ్చి, అనే ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ నుండి కొత్త లుక్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ఫొటోలో నాని కండలు తిరిగిన దేహంతో, పూర్తి మాస్ అవతారంలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఎప్పుడు క్యూట్ గా, లవర్ బాయ్ గా కనిపించే నాని, ఇలా కండలుతిరిగిన దేహంతో ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక తన నట ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, "17 ఏళ్లుగా మీ ప్రేమతో ఇక్కడున్నాను. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది" అనే క్యాప్షన్‌తో నాని ఈ లుక్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

34

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం కావడం వల్ల ‘ది ప్యారడైజ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని ‘జడెల్’ అనే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్స్‌లో టాకీ పార్ట్ చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.తాజాగా ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఘట్టాన్ని తెరకెక్కించారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం విదేశీ స్టంట్ నిపుణులు కూడా పనిచేయడం విశేషం. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

44

ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

ఈ చిత్రంలో హిందీ నటుడు రాఘవ్ జుయల్ విలన్ గా నటిస్తున్నారు. 'కిల్' సినిమాలో తన వినూత్న నటనతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్, ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.‘ది ప్యారడైజ్’ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. మొత్తం 8 భాషల్లో ఈ సినిమాను 2026 మార్చి 26 న విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories