బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎదురైన అనుభవాలు, ఎలిమినేట్ కావడం, తన రెమ్యునరేషన్ తదితర వివరాలని నటరాజ్ మాస్టర్ పంచుకున్నారు. నేను హౌస్ లో నాలా ఉన్నా. జెన్యూన్ గా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నా. కానీ గొర్రె కసాయివాడిని నమ్మినట్లు కొందరు నాటకాలు ఆడవారికే సపోర్ట్ చేశారు. అందువల్లే తాను ఎలిమినేట్ అయినట్లు నటరాజ్ విచారం వ్యక్తం చేశాడు.