NNNM Collections: నారీ నారీ నడుమ మురారి 14 రోజుల కలెక్షన్లు, వందకోట్లు మిస్‌.. శర్వానంద్‌ బ్యాడ్‌ లక్‌

Published : Jan 29, 2026, 09:49 AM IST

శర్వానంద్‌ హీరో నటించిన `నారీ నారీ నడుమ మురారి` మూవీ సంక్రాంతికి విడుదలై హిట్‌గా నిలిచింది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా ఎంత కలెక్ట్ చేసిందనేది తెలుసుకుందాం. 

PREV
15
నారీ నారీ నడుమ మురారి మూవీతో శర్వానంద్‌ కమ్‌ బ్యాక్‌

శర్వానంద్‌ సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్లే అవుతుంది. హీరోగానూ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. కానీ ఇంకా సరైన పేరు, ఇమేజ్‌, స్టార్‌ స్టేటస్‌ రాలేదు. ఇటీవల కాలంలో సక్సెస్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో కొంత గ్యాప్‌తో `నారీ నారీ నడుమ మురారి` మూవీ చేశారు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. నరేష్‌, సిరి హన్ముంతు, వెన్నెల కిశోర్‌, సంపత్‌ రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అనిల్‌ సుంకర నిర్మించారు. ఇది శర్వానంద్‌కి మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది.

25
ప్రీమియర్స్ తోనే నారీ నారీ నడుమ మురారికి హిట్‌ టాక్‌

సంక్రాంతి స్పెషల్‌గా చివరగా ఈ చిత్రం విడుదలైంది. జనవరి 14 సాయంత్రం నుంచి ప్రీమియర్స్ తో స్టార్ట్ అయ్యింది. జనవరి 15 నుంచి రెగ్యూలర్‌ షోస్‌ పడ్డాయి. ఈ మూవీ ప్రారంభం నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. శర్వానంద్‌ కామెడీ ఆకట్టుకుంది. అలాగే సీనియర్‌ నటుడు వీకే నరేష్‌ కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీకి అసలైన హీరో ఆయనే. హీరోయిన్లు నటనతో మెప్పించగా, సిరి సైతం తనదైన నటనతో, కామెడీతో ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, సంపత్‌ రాజ్‌ ఎవరికి వారు రెచ్చిపోయి నటించారు. దీంతో సినిమా ఆడియెన్స్ ని బాగా కనెక్ట్ అయ్యింది.

35
నారీ నారీ నడుమ మురారి కలెక్షన్లు

సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు` తర్వాత అత్యంత పాజిటివ్‌ టాక్ వచ్చిన మూవీ ఇదే అని చెప్పొచ్చు. ఇది ఇప్పటి వరకు 14 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మరి ఈ చిత్రానికి కలెక్షన్లు ఎంత వచ్చాయి, సినిమా హిట్టా, ఫట్టా అనేది చూస్తే, సంక్రాంతి సినిమాల్లో సూపర్‌ హిట్‌ చిత్రాల జాబితాలో `నారీ నారీ నడుమ మురారి` చేరిపోతుంది. ఈ మూవీ ఇప్పటి వరకు దాదాపు రూ.33కోట్లు(గ్రాస్‌) వసూలు చేసింది.

45
లాభాల్లో `నారీ నారీ నడుమ మురారి`

`నారీ నారీ నడుమ మురారి` మూవీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.18కోట్ల షేర్‌ వచ్చింది. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్లు, సీడెడ్‌లో కోటిన్నర, ఆంధ్రాలో ఏడు కోట్లు వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో దాదాపు కోటికిపైగానే వచ్చాయి. ఓవర్సీస్‌లో మూడున్నర కోట్లు వచ్చినట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా రూ.33కోట్లు సాధించింది. ఈ సినిమాకి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11కోట్లు. దీంతో ఇప్పటికే ఇది బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని హిట్‌ దిశగా వెళ్తోంది. బయ్యర్లకి, నిర్మాతలకు రూ.7కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.

55
శర్వానంద్‌ బ్యాక్‌ లక్‌.. వంద కోట్లు చేయాల్సిన మూవీ

`నారీ నారీ నడుమ మురారి` సినిమాకి అత్యంత పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, సంక్రాంతి సీజన్‌ అయినా కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే ఇది వందకోట్లు చేయాల్సిన సినిమా. కానీ మేకర్స్ చెడగొట్టుకున్నారు. హీరోకి, నిర్మాతకి పడలేదని, ఇద్దరి మధ్య వివాదం నడిచిందనే వార్తలు వచ్చాయి. దీంతో సినిమాకి సరైన ప్రమోషన్స్ చేయలేదు. సినిమా రిలీజ్‌ అవుతుందని కూడా చాలా మందికి తెలియదు. రిలీజ్‌కి ముందు రెండు మూడు ప్రోగ్రామ్స్ చేశారు. కానీ అందులోనూ సినిమా టీమ్‌ యాక్టివ్‌గా కనిపించలేదు. పాజిటివ్‌ టాక్‌ వచ్చాక కూడా ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేయలేకపోయారు. హిట్‌ టాక్‌ని కూడా క్యాష్‌ చేసుకోలేకపోయారు. ఇది సినిమా కలెక్షన్లపై గట్టి దెబ్బ పడింది. దీనికితోడు ఈ మూవీకి సరిపడా థియేటర్లు దొరకలేదట. చాలా లిమిటెడ్‌గా రిలీజ్‌ చేశారు. అది కూడా పెద్ద ఎఫెక్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీ హిట్‌ అయినా, ధైర్యంగా చెప్పుకునే పరిస్థితిలో హీరో శర్వానంద్‌ లేకపోవడం గమనార్హం. అది ఆయన బ్యాక్‌ లక్‌ అని చెప్పాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories